కొద్దినెలల క్రితం బాలయ్య చేసిన కొన్ని వ్యాఖ్యలు టాలీవుడ్ లో దుమారం రేపాయి. తెలంగాణా సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తో చిరంజీవి అధ్యక్షతన ఆయన ఇంటిలో జరిగిన మీటింగ్ పై బాలయ్య తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ కి ముఖ్యమైన వారిని కూడా పిలవడకుండా వారు భూములు పంచుకుంటున్నారా అన్నారు. ఆ మీటింగుకి తనకు ఆహ్వానం లేదని చెప్పారు. దీనితో టాలీవుడ్ లో ప్రకంపనలు రేగాయి. బాలయ్య వ్యాఖ్యలపై భిన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. మీటింగ్ కి బాలయ్యను పిలవకపోవడాన్ని కొందరు తప్పుబట్టారు.
కొందరు మాత్రం బాలయ్య వ్యాఖ్యలు సరికాదని,ఆయన అవసరం ఉందనుకుంటే పిలిచే వారని అన్నారు. ఈ వివాదంపై పరిశ్రమ రెండుగా విడిపోయింది. ఇక నాగబాబు బాలయ్యపై ఫైర్ కావడం జరిగింది. ఐతే టాలీవుడ్ ఫైర్ బ్రాండ్ గా పేరున్న మోహన్ బాబు ఈ విషయంపై స్పందించలేదు. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మోహన్ బాబు చిరు, బాలయ్య వివాదంపై తెలివైన సమాధానంతో తప్పుకున్నారు. బాలయ్య నాకు చాలా సన్నిహితుడు, సోదర సమానుడు, మా అన్నగారి బిడ్డగా అతనిపై నాకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. ఐతే అది బాలయ్య వ్యక్తిగత అభిప్రాయం.
దానిపై నేను మాట్లాడను అన్నారు, అలాగే తనను కూడా ఆ మీటింగు కి పిలవలేదని ఆయన చెప్పారు. ఐతే మోహన్ బాబు ఈ మధ్య చిరంజీవికి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ వీరిద్దరి మధ్య విరోధం పోయి స్నేహం చిగురించింది. దీనితో ఈ విషయంలో ఒక్కరి పక్క మాట్లాడి మరొకరికి శత్రువు కావడం ఇష్టం లేక మోహన్ బాబు అలా చెప్పారు అనిపిస్తుంది.