Mohanlal, Ram Charan: అలాంటి పాత్రలో మోహన్ లాల్ కనిపించనున్నారా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ రావడం లేదనే సంగతి తెలిసిందే. చాలా సంవత్సరాల తర్వాత చరణ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా శంకర్ వల్లే ఈ సినిమా షూట్ అంతకంతకూ ఆలస్యమవుతోందని తెలుస్తోంది. భారతీయుడు2 సినిమా విడుదలైన తర్వాతే చరణ్ శంకర్ కాంబో మూవీ థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉందని కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ సినిమాలో మోహన్ లాల్ ముఖ్యమంత్రి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో మోహన్ లాల్ పాత్రకు కూడా ఎక్కువగానే ప్రాధాన్యత ఉంటుందని ఆ పాత్ర చుట్టూ కథ తిరుగుతుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మోహన్ లాల్ ఈ సినిమాతో తెలుగులో మరో సక్సెస్ ను అందుకోనున్నారని దిల్ రాజు ఈ మూవీ ఖర్చు హద్దులు దాటుతున్నా రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతుండటంతో సినిమా విషయంలో రాజీ పడటం లేదని సమాచారం అందుతోంది.

చరణ్ త్వరలో కొత్త సినిమా షూట్ తో బిజీ కానున్నారని తెలుస్తోంది. శంకర్ మూవీ ఎప్పుడు విడుదలైనా ఫ్యాన్స్ ను ఈ సినిమా ఏ మాత్రం నిరుత్సాహపరచదని బోగట్టా. కియారా అద్వానీ, అంజలి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా నుంచి అప్ డేట్స్ ఎప్పుడు వస్తాయనే ప్రశ్నకు సరైన సమాధానం దొరకాల్సి ఉంది.

దిల్ రాజు మాత్రం ఈ సినిమాతో నిర్మాతగా ఊహించని స్థాయిలో లాభాలు గ్యారంటీ అని నమ్మకంతో ఉన్నారు. ఆ నమ్మకాన్ని ఈ సినిమా నిజం చేస్తుందో లేదో చూడాల్సి ఉంది. శంకర్ మూవీతో చరణ్ కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ సాధించాల్సి ఉంది.

అవతార్: ద వే ఆఫ్ వాటర్ సినిమా రివ్యూ& రేటింగ్!
2022లో రీ రిలీజ్ అయిన సినిమాలు ఏవో తెలుసా?

2022లో ప్రపంచ బాక్సాఫీస్‌ని షేక్ చేసిన 12 సాలిడ్ సీన్స్ ఏవో తెలుసా..!
డిజె టిల్లు టు కాంతార….ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ సాధించిన 10 సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus