సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఓ బాల నటికి ఆమె తల్లి ఖరీదైన కారు బహుమతిగా ఇచ్చిందనే వార్త మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతోంది.. 13 ఏళ్ల బాల నటి అందుకున్న ఈ విలువైన గిఫ్ట్ గురించి కొందరు ఆమెను అభినందిస్తుంటే.. మరికొందరు ఆసక్తికరంగా స్పందించారు.. అసలేం జరిగిందంటే.. చైల్డ్ ఆర్టిస్ట్, టీనేజ్ ఇన్‌ఫ్లుయెన్సర్ రివా అరోరా.. రూ. 44 లక్షల విలువైన ఆడి కార్ సొంతం చేసుకుంది..
ఆమె వయసు 13 సంవత్సరాలు.. ‘మామ్’, ‘మణికర్ణిక’, ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’, ‘గుంజన్ సక్సేనా : ది కార్గిల్ గర్ల్’, ‘ది సర్జికల్ స్ట్రైక్’ వంటి సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. చివరిగా రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘ఛత్రివాలి’ లో కనిపించింది.. అలాగే పలు మ్యూజిక్ వీడియోలతోనూ అలరించింది.. కాగా 2010లో పుట్టిందని భావిస్తున్న రివా అరోరా వయసు విషయంలో వివాదం నెలకొంది..
ఆమె వయసు 13 అని బయటి వారు అంటుంటే, తల్లి నిషా మాత్రం 16 అని చెప్పడం విశేషం.. ఇక విషయంలో కొస్తే.. రివా అరోరా ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో 10 మిలయన్ల మంది ఫాలోవర్స్‌ని సొంతం చేసుకుంది.. చిన్న వయసులో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుని ఏకంగా 10 మిలియన్ మార్క్ క్రాస్ చేసినందుకు గానూ రివాకు ఆమె తల్లి నిషా సర్‌ప్రైజింగ్ గిఫ్ట్ ఇచ్చింది.. రూ. 44 లక్షల విలువైన లగ్జీరియస్ ఆడికార్ కొనిచ్చింది..
బ్లాక్ ఆడి క్యూ 3 కారుతో రకరకాల ఫోజులిస్తూ ఆ ఫోటోలను తన ఇన్‌స్టాలో షేర్ చేసింది రివా.. అయితే ఈ సందర్భంగా నెటిజన్లు, అభిమానులు ఆమెను అభినందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం.. ‘కార్ కొన్నావ్ బాగానే ఉంది.. ఇంతకీ నీకు లైసెన్స్ ఉందా?’ అంటూ ఆటపట్టిస్తున్నారు.. ప్రస్తుతం రివా అరోరా కొత్త కార్ పిక్స్, వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..