టాలీవుడ్ యంగ్ హీరోలు పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంటే, సీనియర్ స్టార్స్ మాత్రం ఇంకా ఆ సరైన బ్రేక్ కోసం చూస్తున్నారు. చిరంజీవి ‘సైరా’తో చేసిన ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. కానీ ఇప్పుడు నటసింహం బాలకృష్ణ మాత్రం ఆ లెక్క మార్చడానికి రెడీ అయ్యారు. నార్త్ ఆడియన్స్‌ని కొట్టాలంటే రొటీన్ మాస్ సరిపోదు, ఎమోషనల్ కనెక్ట్ ఉండాలని గ్రహించి, ఒక సాలిడ్ స్కెచ్‌తో రంగంలోకి దిగుతున్నారు.
AKHANDA 2
మామూలుగానే బాలయ్య – బోయపాటి కాంబో అంటే మాస్ వైబ్రేషన్స్ గ్యారెంటీ. ఇప్పుడు ‘అఖండ 2’ కోసం వారు ఎంచుకున్న రూట్ చాలా డిఫరెంట్. దేశంలోనే అత్యంత కీలకమైన ఉత్తరప్రదేశ్‌ను పాజిటివ్ గా మార్చుకోవాలని ప్లాన్ చేస్తున్నారు. హిందుత్వం, దైవభక్తి అనే అంశాలు అక్కడ బలంగా ఉంటాయి కాబట్టి, సినిమా థీమ్‌ను అక్కడి నుంచే జనాల్లోకి తీసుకెళ్లాలని డిసైడ్ అయ్యారట.
దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ బోయపాటి శ్రీను. ఈ సినిమాలోని కొన్ని పవర్ ఫుల్ డైలాగ్స్, సనాతన ధర్మానికి సంబంధించిన సీన్స్‌ను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ప్రత్యేకంగా చూపించినట్లు తెలుస్తోంది. ఆ కంటెంట్ చూసి యోగి ఇంప్రెస్ అయ్యారని, ఈ సినిమా కాన్సెప్ట్ నార్త్ జనాలకు ఖచ్చితంగా నచ్చుతుందని ఆయన అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
ఇక అసలైన హైలైట్ ఏంటంటే.. వారణాసి వేదికగా ఒక భారీ ఈవెంట్‌ను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా సాక్షాత్తు యోగి ఆదిత్యనాథ్ రాబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్. ఒకవేళ బాలయ్య పక్కన యోగి స్టేజ్ మీద కనిపిస్తే, ఆ ఇంపాక్ట్ ఊహకందదు. ‘అఖండ’ హిందీ డబ్బింగ్ వెర్షన్‌కు అక్కడ ఆల్రెడీ మంచి క్రేజ్ ఉంది, దానికి ఇప్పుడు పొలిటికల్ సపోర్ట్ కూడా తోడైతే కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం.
ఇప్పటివరకు కేవలం ప్రభాస్, బన్నీ లాంటి యంగ్ స్టార్స్‌కే సాధ్యమైన పాన్ ఇండియా మ్యాజిక్‌ను, బాలయ్య ఈ స్ట్రాటజీతో బ్రేక్ చేసేలా ఉన్నారు. అఘోరా గెటప్, డివైన్ ఎలిమెంట్స్ నార్త్ బెల్ట్ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. యోగి ఎంట్రీతోనే సినిమాకు కావాల్సిన పబ్లిసిటీ వచ్చేస్తుంది. మొత్తానికి ఈ కాశీ యాత్రతో బాలయ్య బాలీవుడ్ కోటను బద్దలు కొడతారో లేదో చూడాలి.
