Mr Bachchan Collections: ‘మిస్టర్ బచ్చన్’ మొదటి వారం కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే?
- August 22, 2024 / 03:42 PM ISTByFilmy Focus
మాస్ మహారాజ్ రవితేజ (Ravi Teja) , స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) కాంబినేషన్ అంటే ప్రేక్షకుల్లో ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఈ కాంబోలో వచ్చిన ‘మిరపకాయ్’ (Mirapakay) మంచి సక్సెస్ అందుకుంది. దాని తర్వాత రూపొందిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan) . ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. వివేక్ కూచిభొట్ల (Vivek Kuchibhotla) సహ నిర్మాతగా వ్యవహరించారు. మిక్కీ జె మేయర్ (Mickey J Meyer) సంగీతంలో రూపొందిన పాటలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. ప్రమోషన్స్ లో భాగంగా విడుదల చేసిన టీజర్, ట్రైలర్ వంటివి కూడా అభిమానుల్ని, ప్రేక్షకులను మెప్పించాయి.
Mr Bachchan Collections

మొదటి రోజు ‘మిస్టర్ బచ్చన్’ కి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది. దీంతో మొదటి రోజు ఓపెనింగ్స్ కూడా బాగానే వచ్చాయి అని చెప్పాలి. కానీ 2వ రోజు నుండి కలెక్షన్స్ డౌన్ అయ్యాయి. తర్వాత కోలుకుంది అంటూ ఏమీ లేదు. ఒకసారి (Mr Bachchan Collections) ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ని గమనిస్తే :
| నైజాం | 2.95 cr |
| సీడెడ్ | 1.08 cr |
| ఉత్తరాంధ్ర | 0.75 cr |
| ఈస్ట్ | 0.45 cr |
| వెస్ట్ | 0.35 cr |
| గుంటూరు | 0.51 cr |
| కృష్ణా | 0.34 cr |
| నెల్లూరు | 0.25 cr |
| ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.68 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.42 Cr |
| ఓవర్సీస్ | 0.57 Cr |
| వరల్డ్ వైడ్ (టోటల్) | 7.67 cr |
‘మిస్టర్ బచ్చన్’ చిత్రానికి రూ.33 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.34 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి వారం పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.7.67 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.26.33 కోట్లు షేర్ ను రాబట్టాల్సి ఉంది.















