Mrunal Thakur: కాన్స్‌ ఫెస్టివల్‌ కోసం మృణాల్‌ రెడీ.. మనసులో ఏముందో చెప్పేసింది!

కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌… ప్రపంచవ్యాప్తంగా సినిమా ప్రియులు, హీరోయిన్ల అభిమానులు ఎదురుచూసే పండగ. కాన్స్‌ వేదికగా కథానాయికలు అలా హంసల్లా నడుచుకుంటూ వస్తుంటే రెండు కళ్లూ చాలవు అని అంటుంటారు. అలాంటి వేదిక మీద అలా అలా నడవాలని హీరోయిన్లు కోరుకుంటూ ఉంటారు. విదేశీ హీరోయిన్లకు కానీ, మన హీరోయిన్లకు కానీ ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని చూస్తుంటారు. ఇప్పుడు ఇదే ఆనందం త్వరలో మృణాల్‌ ఠాకూర్‌కి దక్కనుంది.

ఫ్రాన్స్‌లో కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ కనుల పండగలా జరగనుంది. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఈ వేడుకకు మృణాల్‌ ఠాకూర్‌ కూడా వెళ్తనుంది. తొలిసారి తనకు అవకాశం వచ్చినట్లు చెబుతూ.. దీని కోసం ఆమె మనసులో మాటలను కూడా చెప్పుకొచ్చింది. మాటల్లో చెప్పలేనంత ఆనందంగా ఉందంటూ తన హ్యాపీనెస్‌ను కూడా వివరించింది. ప్రతిష్ఠాత్మకమైన కాన్స్‌ వేడుకకు నన్ను ఆహ్వానించినందుకు ఆనందంగా ఉంది. మొదటిసారి నేను ఆ వేదికపై అడుగుపెడుతున్నాను.

అంతర్జాతీయ స్థాయిలో దర్శకనిర్మాతలతో మాట్లాడటానికి చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను అని చెప్పింది మృణాల్‌. కొత్త అవకాశాల కోసం, నా ప్రతిభను నిరూపించుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను అని కూడా చెప్పింది. మామూలుగానే ఫ్యాషన్‌ ప్రియుల కోసం ఆ వేడుక స్పెషల్‌. అందులోనూ ఇటీవల మృణాల్‌ చాలా మారిపోయింది.‘మా సీత ఇలా ఉండదు’ అంటూ ఆమె ఫొటోల కింద కామెంట్లు కనిపిస్తున్నాయి కూడా. అలాంటి మృణాల్‌ ఎలాంటి అవుట్‌ఫిట్‌లో కనిపిస్తుందో చూడాలి.

ఇక మృణాల్‌ (Mrunal Thakur) సినిమాల విషయానికొస్తే ఇటీవలే ‘గుమ్రా’ సినిమాలో పోలీస్‌గా నటించింది. ఇటు తెలుగులో, అటు హిందీలో మృణాల్‌ బాలీవుడ్‌లోనూ అవకాశాలను అందుకుంటోంది. తెలుగులో నాని సరసన నటిస్తోంది. హిందీలో మృణాల్‌ మూడు సినిమాల్లో నటిస్తోంది. ‘పూజా మేరీ జాన్‌’, ‘పిప్పా’, ‘ఆంఖ్‌ మిచోలీ’ అనే సినిమాల్లో నటిస్తోంది. తొలి రెండు సినిమాలు షూటింగ్‌ పూర్తవ్వగా, ఆఖరి సినిమా షూటింగ్‌ దశలో ఉంది. దీంతోపాటు మరికొన్ని తెలుగు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus