మృణాల్ ఠాకూర్.. తెలుగు సినిమాల్లో కాస్ట్‌లీ హీరోయిన్. అంటే ధనిక కుటుంబాలకు చెందిన అమ్మాయిగా సినిమాల్లో కనిపిస్తూ ఉంటుంది. కావాలంటే మీరే చూసుకోండి ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాల్లో అన్నీ అలాంటి పాత్రలే. అయితే నిజ జీవితానికి ఇవి చాలా దూరంగా ఉండే పాత్రలు అని తెలుసా. ఒక సగటు భారతీయ కుటుంబానికి చెందినది మృణాల్ ఠాకూర్. అలా అని సినిమాల్లోకి అనుకొని, ఎన్నో ఏళ్లుగా కలలు కని వచ్చిందేమో అనుకునేరు.. అస్సలు కాదు.
నటన అనేది నా చిన్ననాటి కల కాదు. విధి నన్ను ఈ రంగంలో అడుగుపెట్టేలా చేసింది అంటూ మృణాల్ ఠాకూర్ తన ఎర్లీ లైఫ్ గురించి చెప్పింది. తన బాల్యమంతా వివిధ పట్టణాలకు తిరగడానికే సరిపోయిందని, అలా ఎప్పటికప్పుడు ప్రాంతాలు మారడం వల్ల కొత్త వాతావరణాలకి అనుగుణంగా అలవాటు పడిపోయానని చెప్పింది మృణాల్. అలా అని ఎప్పుడూ బాధపడలేదు అని కూడా చెప్పిందామె. అలా దాదాపు 10 నుంచి 11 పాఠశాలలు మారి ఉంటానేమో అని చెప్పింది.
అయితే స్కూళ్లు మారినప్పుడు ఎదురయ్యే సమస్యలను ఎదుర్కోవడం అంత సులభం కాదు అని నాటి రోజులు గుర్తు చేసుకుంది. అలాగే చిన్నతనం నుండి ఎప్పుడూ సినిమాల్లోకి రావాలని, నటిగా ఎదగాలని ఎప్పుడూ అనుకోలేదు. అలా ఎప్పుడూ సినిమాల అనేది నా కల కాదు. కానీ కాలం, విధి నన్ను ఈ వైపునకు నడిపించాయి. ఈ క్రమంలోనే బ్యాచిలర్ ఆఫ్ మాస్ మీడియా డిగ్రీ చేశాను. అప్పుడే నటన పట్ల నాకున్న అభిరుచిని తెలుసుకున్నాను అని చెప్పింది మృణాల్.
ఆ తర్వాత సినిమా ప్రయత్నాల కోసం ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు, ఇచ్చాక నటనపై మృణాల్‌కు మరింత ఆసక్తి పెరిగిందట. దాంతోపాటు స్నేహితులు కూడా ఎప్పుడూ ప్రోత్సహించేవారట. అలా తొలి సినిమా నుండి ఇప్పటివరకు చేసిన పాత్రలు కేవలం తన టాలెంట్‌ను చూపించడానికే కాకుండా.. ప్రజల్లో తన మీద మర్చిపోలేని ముద్ర వేయడానికి ఉపయోగపడ్డాయి అని చెప్పింది మృణాల్.