మృణాల్ ఠాకూర్..పరిచయం అవసరం లేని పేరు. ‘సీతా రామం’ అనే చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చి తొలి చిత్రంతోనే తన అందం, అభినయంతో ఎంతో మందికి ఫేవరెట్ హీరోయిన్ అయిపోయింది. చేసింది ఒక్క సినిమానే అయినా ఈమె స్టార్ హీరోయిన్ రేంజ్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఈ బ్యూటీ సీరియల్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించింది. అటు తర్వాత ‘విట్టి దండు’ అనే మరాఠి సినిమాలో నటించింది.
ఆ తర్వాత బాలీవుడ్ లో అడుగుపెట్టి చాలా సినిమాల్లో నటించింది. 8 ఏళ్లుగా సినిమాల్లో నటిస్తున్నా ఈమెకు ఆశించిన బ్రేక్ రాలేదు. ఈ ఏడాది వచ్చిన `సీతారామం` తోనే ఈమె తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకుంది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. అయితే ‘సీతా రామం’ ఈమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అని.. ఈ సినిమా తర్వాత ఈమె కెరీర్ చూడాల్సిన అవసరం లేదని, కచ్చితంగా నెంబర్ హీరోయిన్ రేంజ్ కు ఎదుగుతుంది అని అంతా అనుకున్నారు.
కానీ అలా జరగలేదు. ‘సీతా రామం’ సినిమా రిలీజ్ అయ్యి 4 నెలలు పూర్తి కావస్తున్నా.. ఇప్పటికీ ఈమెకు టాలీవుడ్లో మరో పెద్ద అవకాశం రాలేదు. అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టినా ఈమె ఎందుకు ఇంకో పెద్ద ప్రాజెక్టుకి ఎంపిక కాలేదు.. అనే అనుమానం అందరికీ రావచ్చు. అందుకు కారణం కూడా ఉంది. మృణాల్ ఠాకూర్.. తాను డిమాండ్ చేసిన పారితోషికం ఇవ్వకపోతే సినిమాలకు సైన్ చేయను అని తన వద్దకు వచ్చిన దర్శకనిర్మాతలకు చెబుతుందట.
పారితోషికంతో పాటు ఈమె తన స్టాఫ్ కోసం చెప్పే ఖర్చులు కూడా నిర్మాతలను భయపెడుతున్నాయట. అందుకే మృణాల్ ఖాతాలో ఇంకో పెద్ద ప్రాజెక్టు పడలేదు అని తెలుస్తుంది. మొదటి సినిమాకి ఈమె అందుకున్న పారితోషికం రూ.30 లక్షలు కాగా ఇప్పుడు రూ.80 లక్షల వరకు డిమాండ్ చేస్తుందని వినికిడి.