Mrunal Thakur: ఆ రోల్ నుంచి బయటపడలేకపోయాను.. మృణాల్ ఏమన్నారంటే?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) సీతారామం (Sita Ramam) , హాయ్ నాన్న (Hi Nanna) సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకోగా ఫ్యామిలీస్టార్ సినిమాతో ఆ మ్యాజిక్ ను రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఫ్యామిలీ స్టార్ (Family Star) సినిమాలో సెకండాఫ్ లో మృణాల్ ఠాకూర్ ఎక్స్ ప్రెషన్లపై కూడా కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించాయి. ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూలు ఇస్తున్న మృణాల్ షాకింగ్ విషయాలను చెప్పుకొచ్చారు.

నా స్నేహితుడు, మార్గదర్శి అంతా దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) అని ఆమె అన్నారు. సీతారామం మూవీ షూటింగ్ సమయంలో దుల్కర్ సపోర్ట్ మరవలేనిదని అమె వెల్లడించారు. చాలా కష్టమైన విషయం ఏంటంటే ఒక సినిమా షూటింగ్ ను పూర్తి చేసి వెళ్తున్న సమయంలో గుండె బద్దలైనట్టు అనిపిస్తుందని ఆమె చెప్పుకొచ్చారు. ఏదైనా రోల్ ను ఇష్టపడి చేస్తే ఆ పాత్రలా మారిపోతానని మృణాల్ ఠాకూర్ అన్నారు.

అలా నేను నటించిందే సీతారామం సినిమాలోని సీత పాత్ర అని ఆమె పేర్కొన్నారు. ఆ రోల్ నుంచి బయటపడటానికి చాలా సమయం పట్టిందని మృణాల్ పేర్కొన్నారు. హిందీలో ఎక్కువగా గ్లామరస్ రోల్స్ లో నటించిన ఈ బ్యూటీ రాబోయే రోజుల్లో తెలుగులో సైతం అవే తరహా పాత్రలలో నటిస్తారేమో చూడాల్సి ఉంది. తెలుగులో మృణాల్ ఠాకూర్ కొత్త సినిమాలకు సంబంధించి క్లారిటీ రావాల్సి ఉంది.

మృణాల్ ఠాకూర్ కథ, పాత్ర నచ్చితే మాత్రమే కొత్త ప్రాజెక్ట్ లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది. మృణాల్ ఠాకూర్ టాలెంట్ కు తగ్గ విజయాలు దక్కాలని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. సరైన ప్రాజెక్ట్ లను ఎంచుకుంటే మృణాల్ ఠాకూర్ కు తిరుగుండదని కామెంట్లు వినిపిస్తున్నాయి. తమిళంలో త్వరలో మృణాల్ ఠాకూర్ ఎంట్రీ ఇవ్వనున్నారని సమాచారం అందుతోంది. మృణాల్ ఠాకూర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ను అంతకంతకూ పెంచుకుంటున్నారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus