మృణాల్ ఠాకూర్ కు సోషల్ మీడియాలో ఎక్కువ ఫాలోయింగే ఉంది. ఈమె గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ.. అందాన్ని ఆరాధించే వారి సంఖ్య ఎక్కువే. అందుకే ఈమె గురించి ఏ చిన్న న్యూస్ బయటకు వచ్చినా.. సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ముఖ్యంగా ‘ఈమె ఫలానా హీరోతో రిలేషన్లో ఉంది’ వంటి వార్తల గురించి అయితే చెప్పనవసరం లేదు.
‘ఫ్యామిలీ స్టార్’ సినిమా టైంలో విజయ్ దేవరకొండతో ఈమె రిలేషన్లో ఉంది అంటూ ప్రచారం జరిగింది. అటు తర్వాత సుమంత్ తో పెళ్లి వరకు వెళ్ళింది అనే టాక్ కూడా నడిచింది. వాటిని సుమంత్ కొట్టిపారేశాడు.
ఇక ఇప్పుడు తమిళ స్టార్ హీరో ధనుష్‌తో ఈమె ప్రేమలో ఉందంటూ వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ ఏ సినిమాలోనూ కలిసి నటించింది లేదు. ఎక్కువగా మీడియా కంట పడింది కూడా లేదు. ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ స్పెషల్ స్క్రీనింగ్ టైంలో మాత్రం మృణాల్, ధనుష్ కలిసి కనిపించారు. అంతే ఇక ఈ ప్రచారానికి బూస్టప్ ఇచ్చినట్టు అయ్యింది.
లేటెస్ట్ టాక్ ప్రకారం, ఇటీవల మృణాల్ ఠాకూర్ ధనుష్ సోదరీల కుటుంబాన్ని కలిసింది అంటున్నారు. మరికొంత మంది అయితే ధనుష్ స్వయంగా తన సోదరీలకి మృణాల్‌ను పరిచయం చేశాడని చెబుతున్నారు.ధనుష్ కు కార్తికా కార్తిక్, విమల గీతా వంటి ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వాళ్ళను మృణాల్ సోషల్ మీడియాలో ఫాలో అవుతుందని కూడా కొందరు అంటున్నారు. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ ఇంకా పెళ్లి చేసుకోలేదు. మరోపక్క ధనుష్ తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్‌తో 2022లో విడాకులు తీసుకున్నాడు.