సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టి పదేళ్లు దాటిపోయినా… ఇంకా తెలుగులో ఆమె కొత్త నాయికే. ఎందుకంటే మన దగ్గరకు వచ్చి ఏడాదే అవుతోంది మరి. అయితే ఇన్నేళ్ల తన కెరీర్‌లో ఎత్తు పల్లాలు చూసిన ఆమె జీవితం గురించి, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. అన్నట్లు ఆమె పేరు చెప్పలేదు కదా వైన్ లాంటి హీరోయిన్ పాత్ర చేసిన మృణాల్ ఠాకూర్. ఈ వైన్ ఏంటి అనుకుంటున్నారా? ఆఖరులో చెబుతాం లెండి. ఈలోపు ఆమె వేదాంతం సంగతి చూసేయండి.
అందం, అభినయంతో ప్రతి పాత్రపైనా తనదైన ముద్ర వేస్తోంది మృణాల్ ఠాకూర్. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ‘సీతారామం’ సినిమాలో సీతగా అద్భుతం అనిపిస్తే… ‘హాయ్ నాన్న’ సినిమాలో యష్నగా మరింత ప్రేక్షకులకు దగ్గరైంది. అలాంటి పాత్రలు ఎలా దక్కుతున్నాయి అని అడిగితే… మనకు దక్కాలని రాసి పెట్టి ఉన్నది ఎప్పటికైనా దక్కక మానదు.. ఒక్కోసారి ఆలస్యమైనా తప్పక దక్కుతుంది అనే సూత్రాన్ని తాను బాగా విశ్వసిస్తానని, అదే జరుగుతోంది అని చెప్పింది.
తనకొచ్చే మంచి పాత్రలు, సినిమాలు కొంచెం ఆలస్యంగానైనా తప్పకుండా వస్తాయని అనుకునేదానిని చెప్పిన మృణాల్ ‘సీతారామం’లోని సీత, ‘హాయ్ నాన్న’లోని యష్నను చాలామంది మెచ్చుకుంటున్నారు అని చెప్పింది. కాలం గడిచినకొద్దీ వైన్ రుచి పెరుగుతుందంటారు. అలా సీత, యశ్న కూడా మరపురానివిగా గుర్తుండిపోతాయి. ‘సీతారామం’ సినిమాలోని కొన్ని సన్నివేశాలు అద్భుతంగా ఉన్నాయంటూ ఇప్పటికీ కొంతమంది వీడియో క్లిప్స్ షేర్ చేస్తున్నారు. అది చాలట తన కెరీర్‌కి.
ఇక మృణాల్ (Mrunal Thakur) కొత్త సినిమాల సంగతి చూస్తే విజయ్ దేవరకొండతో ‘ఫ్యామిలీ స్టార్’ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌లో ‘పూజా మేరీ జాన్’ అనే మూవీ చేస్తోంది. ఈ రెండు సినిమాల్లోని పాత్రలు కూడా వైన్ లాగా పాత బడే కొద్దీ అలరించేలా ఉంటాయి అని నమ్మకం వ్యక్తం చేసింది మృణాల్. మరి ఎలా ఉంటాయో చూడాలి. ఫ్యామిలీ స్టార్ అయితే సమ్మర్‌లో వస్తాడు.