‘సీతారామం’ చిత్రంతో మృణాల్ కి టాలీవుడ్లో మంచి ఇమేజ్ ఏర్పడింది. ఆ సినిమాలో ఆమె లుక్స్ కానీ ఆమె నటన కానీ సూపర్ గా ఉంటాయి. చీకత్తులో కూడా చాలా హుందాగా నడుస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది మృణాల్. అలాంటి ఇమేజ్ ను సంపాదించుకున్న మృణాల్ ను మరోలా ఊహించుకోవడానికీ ఎవ్వరి మనసు అంగీకరించకపోవచ్చు. కానీ ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫోటోలతో ఆ అభిప్రాయం తప్పు అని చెప్పకనే చెప్పింది.
బాలీవుడ్ సినిమాల్లో అయితే (Mrunal Thakur) ఈమె చేసే గ్లామర్ షో మామూలుగా ఉండదు అనే చెప్పాలి. తాజాగా ఈమె ‘లస్ట్ స్టోరీస్ 2 ‘ అనే వెబ్ సిరీస్ లో నటించింది. చాలా రోజులుగా ఈ వెబ్ సిరీస్ ప్రచారంలో ఉంది. నిన్న అర్ధరాత్రి నుండి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సిరీస్ లో మృణాల్ తో పాటు తమన్నా, కాజోల్, కొంకణా శర్మతో వంటి వారు కూడా కీలక పాత్రలు పోషించారు. ఇందులో మృణాల్ కి సంబంధించిన ఓ బెడ్ రూమ్ సీన్ ఉంది.
ఇంకా ఉన్నాయని సోషల్ మీడియాలో డిస్కషన్ నడుస్తుంది అయితే సోషల్ మీడియాలో ఒక సీన్ బాగా వైరల్ అవుతుంది. ఇందులో ఆమె ఇలాంటి సన్నివేశాలకి భయపడను అన్నట్టు నటించింది. ఆమె పేరుతో సోషల్ మీడియాలో ఈ సీన్ ను తెగ వైరల్ చేస్తున్నారు నెటిజన్లు. తెలుగు ప్రేక్షకులకి కొత్త కాబట్టి.. షాక్ కి గురవుతున్నారు అనే చెప్పాలి.