మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం ‘విశ్వంభర’ (Vishwambhara) అనే సోసియో ఫాంటసీ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా షూటింగ్ చాలా వరకు కంప్లీట్ అయ్యింది. కానీ వీ.ఎఫ్.ఎక్స్ వర్క్ అలాగే రెండు పాటలు షూట్ చేయాల్సి ఉంది. జనవరిలో ఈ సినిమా రిలీజ్ అవ్వాలి. కానీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) కోసం వాయిదా వేశారు. తర్వాత సమ్మర్ కి పోస్ట్ ఫోన్ చేశారు. మే 9న ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ (Jagadeka Veerudu Athiloka Sundari) సినిమా రిలీజ్ డేట్ కి ‘విశ్వంభర’ ని దిమ్పాలనుకున్నారు.
కానీ వి.ఎఫ్.ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. అందువల్ల మళ్ళీ వాయిదా పడినట్టే అనుకోవాలి. అదే డేట్ కి ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu) రిలీజ్ కాబోతున్నట్లు ప్రకటన కూడా వచ్చింది. మరి ‘విశ్వంభర’ నెక్స్ట్ డేట్ ఎప్పుడు? అంటే.. ఆగస్టు అని కొందరు అంటున్నారు. అయితే ఆ టైంలో ఎన్టీఆర్ (Jr NTR) ‘వార్ 2’ రజినీకాంత్ ‘కూలీ’ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. వెంటనే ‘విశ్వంభర’ వస్తుందా అంటే డౌటే.
సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. ‘విశ్వంభర’ తర్వాత చిరు… అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు. స్క్రిప్ట్ వర్క్ ను అనిల్ కంప్లీట్ చేసేశాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి. చిరుకి జోడీగా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ ను (Mrunal Thakur) హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నట్టు ప్రచారం జరిగింది.
మృణాల్ ను అనిల్ అండ్ టీం అప్రోచ్ అయ్యారు. కానీ ఇంతలో అదితి రావ్ హైదరిని (Aditi Rao Hydari) హీరోయిన్ గా ఫైనల్ చేసినట్లు.. మరికొంతమంది ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి ‘విశ్వంభర’ కోసం అదితి రావ్ హైదరిని సంప్రదించినట్లు ప్రచారం జరిగింది. మరి అనిల్ ఏ హీరోయిన్ ను ఫైనల్ చేశాడు? అనేది తెలియాల్సి ఉంది.