కమెడియన్ యోగిబాబు సర్‌ప్రైజ్ చేసిన ధోనీ!

టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ నిర్మాతగా మారుతున్నారు. ధోనీ ఎంటర్టైన్మెంట్స్ పేరుతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టారు. ఈ బ్యానర్ లో ముందుగా ఒక తమిళ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అదే ‘లెట్స్ గెట్ మ్యారీడ్’. ఈ సినిమాలో ‘లవ్ టుడే’ ఫేమ్ ఇవానా, ప్రముఖ నటి నదియా, హరీష్ కళ్యాణ్ లు నటిస్తున్నారు. అలానే ప్రముఖ కమెడియన్ యోగిబాబు నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమాలను నిర్వహించారు.

కామెడీ, కుటుంబ కథా చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాలో నటిస్తోన్న యోగిబాబుకి ఎమ్మెస్ ధోనీ స్పెషల్ గిఫ్ట్ ను అందించారు. ఆయన సంతకం చేసిన బ్యాట్ ను యోగిబాబుకి పంపించారు. ఆ బ్యాట్ ను పట్టుకొని యోగిబాబు దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యోగిబాబుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం.

ఆయనకు సమయం దొరికినప్పుడల్లా.. క్రికెట్ ఆడుతూ కనిపిస్తుంటారు. సినిమా లొకేషన్స్ లో కూడా అప్పుడప్పుడు బ్యాట్ పట్టుకొని సందడి చేస్తుంటారు. యోగిబాబు క్రికెట్ ఆడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. ఆయన అభిమాన క్రికెటర్ ధోనీ నుంచి ఇప్పుడు బ్యాట్ గిఫ్ట్ గా రావడంతో యోగిబాబు ఆనందానికి అవధుల్లేవు. పైగా ఆయన ప్రొడక్షన్ హౌస్ లో పని చేస్తున్నందుకు సంతోషంగా ఫీల్ అవుతున్నారు.

ఇక ఎమ్మెస్ ధోనీ విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్నారు. బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు. 2023 ఐపీఎల్ సీజన్ ధోనీ ఆడే చివరి ఐపీఎల్ అని అంటున్నారు. అందులో ఎంతవరకు నిజముందోచూడాలి . ధోనీ గనుక రిటైర్ అయితే.. చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ గా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ను ఎన్నుకునే అవకాశాలు ఉన్నాయి.

అమిగోస్ సినిమా రివ్యూ & రేటింగ్!
పాప్ కార్న్ సినిమా రివ్యూ & రేటింగ్!

వేద సినిమా రివ్యూ & రేటింగ్!
యూ.ఎస్ లో టాప్ గ్రాసర్స్ గా నిలిచిన 10 టాలీవుడ్ సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus