పుస్తకం కవర్ పేజీ చూసి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దంటారు పెద్దలు. అలాగే పోస్టర్, టీజర్ చూసి సినిమా ఎలా ఉంటుందో చెప్పకూడదంటారు మన సినిమా పెద్దలు. పోస్టర్ బాగుండి… తుస్‌మన్న సినిమాలు ఎన్నో, పోస్టర్ చూసి ‘ప్చ్’ అని అదిరిపోయిన సినిమాలెన్నో. అందుకే పోస్టర్, టీజర్ నమ్మొద్దు… సినిమా చూడండి మీకు నచ్చుతుంది అంటూ ప్రముఖ దర్శకనిర్మాత ఎం.ఎస్.రాజు ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ‘మనసంతా నువ్వే’, ‘ఒక్కడు’, ‘వర్షం’, ‘వాన’ వంటి సినిమాలు రూపొందించిన ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన ‘డర్టీ హరి’ ఈ నెల 18న ఫ్రైడే మూవీస్ ఏటీటీ ద్వారా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో ఎం.ఎస్.రాజు చెప్పిన విషయాలు ఇవీ…
‘‘చిరంజీవి, మహేష్‌బాబు లాంటి స్టార్ హీరోలు, స్టార్ దర్శక నిర్మాతల వరకూ.. అందరూ ఎప్పుడో ఒక సమయంలో, ఏదో ఒక దశలో గ్యాప్ తీసుకున్నారు. చెప్పాలంటే తీసుకోవాల్సి వచ్చింది. నేనూ అంతే… వరుస సినిమాలు చేస్తూ ఇటీవల కొన్నాళ్లు గ్యాప్ తీసుకున్నాను. కాకపోతే కాస్త ఎక్కువ రోజులు ఇంట్లో కూర్చున్నాను. 30 ఏళ్ల నా కెరీర్‌లో దర్శకుడిగా, నిర్మాతగా ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. ఫ్లాప్ వచ్చిన ‘ఎం. ఎస్.రాజు పని అయిపోయింది’ అని అనుకున్నప్పుడల్లా బంపర్ హిట్‌లతో నేనేంటో నిరూపించుకున్నా. ‘తూనీగ తూనీగ’ తర్వాత ఏం చేయాలనే ఆలోచనలో పడ్డాను. అలవాటైన నిర్మాతగా ఉండిపోవాలా, మెగా ఫోన్ పట్టాలా అని ఆలోచించాను. అలా అలా తెలియకుండానే చాలా గ్యాప్ తీసుకున్నాను’’ అని అన్నారు ఎం.ఎస్.రాజు.
‘‘నేను చాలా రకాల జోనర్లు ప్రయత్నించా. అన్నింటా మంచి పేరే వచ్చింది. అలా పూర్తిస్థాయి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ చేద్దామనే ఆలోచన వచ్చింది. అప్పుడే ‘డర్టీ హరి’ ఆలోచన వచ్చింది. ఈ సినిమాలో వల్గారిటీ ఉండదు. ఎప్పటిలా ఎం.ఎస్.రాజు మార్క్ ఫిల్మే’’ అని చెప్పారు ఎం.ఎస్.రాజు. ‘‘థియేటర్లలోనే ఈ సినిమా విడుదల చేద్దాం అనుకున్నాం. కరోనా వల్ల మా ప్లాన్స్ మార్చాల్సి వచ్చింది. అలా ఏటీటీ వైపు అడుగేశాం. రెస్పాన్స్ బాగుంటే సినిమాను థియేటర్లలో విడుదల చేసే ప్రయత్నం చేస్తాం. ఓటీటీలకు కూడా వెళ్లే ఆలోచన ఉంది’’ అని చెప్పారు ఎం.ఎస్.రాజు.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!