Manchu Manoj: మంచు మనోజ్ రెండో పెళ్ళి డేట్ ఫిక్స్!

  • February 25, 2023 / 12:52 PM IST

మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.  భూమా మౌనిక రెడ్డిని మనోజ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నట్టు చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.వీరిద్దరూ కూడా పలు సందర్భాల్లో కలిసి కనిపించారు. గతేడాది జరిగిన ఖైరతాబాద్ గణేష్ చతుర్థి వేడుకల్లో మనోజ్, మౌనిక పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ విషయం పై మంచి రోజు చూసి స్పందిస్తాను అని ఆ టైంలో మనోజ్ చెప్పడం జరిగింది.

మౌనిక రెడ్డి కి కూడా ఇదివరకే పెళ్లి అయ్యింది. ఈమెకు సంతానం కూడా ఉంది. ఈమె మొదటి పెళ్లికి మనోజ్ కూడా హాజరయ్యాడు. అందుకు సంబంధించిన వీడియో కూడా మొన్నామధ్య వైరల్ అయ్యింది. ఇక మనోజ్ – మౌనిక ల వివాహానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మార్చ్ 3 న మౌనిక – మనోజ్ ల పెళ్లి జరగనుంది. ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో భాగంగా మంచు మనోజ్ సోదరి లక్ష్మీ ప్రసన్న ఇంట్లో ఓ ఫంక్షన్ కూడా జరిగింది.

అయితే రెండో పెళ్లి విషయాన్ని మనోజ్ అధికారికంగా ప్రకటించలేదు. మనోజ్ కు గతంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయితో పెళ్ళైన సంగతి తెలిసిందే. అయితే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడిపోయారు. మనోజ్ ఈ విషయాన్ని జీర్ణించుకోలేక మానసికంగా కృంగిపోయాడు . డిప్రెషన్ కు కూడా లోనయ్యాడు. సినిమాలకు కూడా దూరమయ్యాడు. తిరిగి సినిమాల్లో బిజీ అవ్వాలని అహం బ్రహ్మాస్మి అనే పాన్ ఇండియా సినిమా మొదలుపెడితే.. అనుకోకుండా ఆ ప్రాజెక్టు కూడా ఆగిపోయింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus