‘పవర్ పేట’ షూట్‌కి ముహూర్తం ఫిక్స్ చేసిన నితిన్

మ్యారేజ్ తరువాత నితిన్ ఫుల్ స్వింగులో షూటింగులు చేస్తున్నారు. ఆల్రెడీ యాక్సెప్ట్ చేసిన సిన్మాలకు షెడ్యూళ్ళు ఫిక్స్ చేస్తున్నారు. వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో నితిన్ హీరోగా యాక్ట్ చేస్తున్న సినిమా ‘రంగ్ దే’. రీసెంట్‌గా హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రెస్ట్ తీసుకోకుండా చంద్రశేఖర్ యేలేటి డైరెక్షన్‌లో యాక్ట్ చేస్తున్న ‘చెక్’ షూటింగ్ స్టార్ట్ చేశాడు. ఇవి కంప్లీట్ అయ్యాక మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో ‘అంధాధున్’ రీమేక్ స్టార్ట్ చెయ్యనున్నాడు.

‘రంగ్ దే’, ‘చెక్’, ‘అంధాధున్’ షూటింగులు కంప్లీట్ చేశాక నితిన్ కెరీర్ లో స్పెషల్ ఫిలిం ‘పవర్ పేట’ స్టార్ట్ కానుంది. లిరిక్ రైటర్ నుండి డైరెక్టర్ గా మారిన కృష్ణచైతన్య డైరెక్షన్ లో నితిన్ యాక్ట్ చెయ్యనున్న సినిమా ‘పవర్ పేట’. ‘ఛల్ మోహన్ రంగ’ తరువాత వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న సినిమా. రెండు పార్టులుగా సినిమా చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఫిక్షనల్ బయోగ్రఫీగా కృష్ణచైతన్య స్క్రిప్ట్ రాశాడట. ఫిబ్రవరి నుండి నితిన్ ఈ సినిమా సెట్స్ మీదకు రానున్నాడు.

ఫిబ్రవరిలో నితిన్ ‘పవర్ పేట’ షూటింగ్ స్టార్ట్ చేస్తే… అతడి పక్కన హీరోయిన్ రోల్ చేస్తున్న కీర్తీ సురేష్ మార్చి నుండి సెట్స్ లోకి ఎంటర్ అవుతారని తెలిసింది. ఈ సినిమా కోసం నితిన్ మేకోవర్ అవ్వనున్నాడు. ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, కారైకుడి, మైసూర్, హైదరాబాద్ తదితర ఏరియాలలో షూటింగ్ చెయ్యడానికి ప్లాన్ చేశారు. ఈ సినిమాకి మణిశర్మ మ్యూజిక్ డైరెక్టర్.

Most Recommended Video

చిన్నపిల్లలుగా మారిపోయిన ‘బిగ్ బాస్4’ కంటెస్టెంట్స్.. ఎలా ఉన్నారో మీరే చూడండి..!
‘సర్జరీ’ చేయించుకున్న హీరోయిన్లు వీళ్ళే!
భీభత్సమైన బ్లాక్ బస్టర్ ఇచ్చిన హీరోలే తరువాత భయంకరమైన డిజాస్టర్లు కూడా ఇచ్చారు…!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus