యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ షూటింగ్ ఇప్పట్లో మొదలుకాదని గత కొన్ని నెలలుగా వార్తలు ప్రచారంలోకి వస్తుండగా ఆ వార్తలు ఎన్టీఆర్ అభిమానులను నిరాశకు గురి చేశాయనే సంగతి తెలిసిందే. మరోవైపు బింబిసార మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తారక్ నార్మల్ లుక్ లోనే కనిపించడంతో ఈ సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ నెల 26వ తేదీన తారక్ కొరటాల కాంబో మూవీ పూజా కార్యక్రమాలు మొదలవుతాయని పూజా కార్యక్రమాలు పూర్తైన తర్వాత ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది.
తారక్30 ఓపెనింగ్ డేట్ పై క్లారిటీ రావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. తారక్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ ఈ సినిమాలో నటించే ఛాన్స్ అయితే ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. త్వరలోనే ఈ సినిమాలో నటించే హీరోయిన్ కు సంబంధించి అధికారికంగా క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. తారక్ ఈ ప్రాజెక్ట్ తో మరో సక్సెస్ ను సొంతం చేసుకోవడం ఖాయమని ఆచార్య సినిమా ఫ్లాప్ రిజల్ట్ ను అందుకున్నా కొరటాల శివ తారక్ సినిమాతో ప్రూవ్ చేసుకోవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. సినిమాసినిమాకు తారక్ రేంజ్ పెరుగుతోంది. ఎన్టీఆర్ 30 షూటింగ్ కు సంబంధించి వైరల్ అవుతున్న గాసిప్స్ ఓపెనింగ్ డేట్ గురించి క్లారిటీ వచ్చిన నేపథ్యంలో ఆగిపోతాయేమో చూడాల్సి ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో కూడా సక్సెస్ ను సొంతం చేసుకుంటానని భావిస్తున్నారు. కథల ఎంపికలో తారక్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటుండగా తారక్ తర్వాత ప్రాజెక్ట్ లు ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కనున్నాయి.