ముక్కు అవినాష్ పెళ్లి సందడి..హల్దీ వేడుకలో ముక్కు అవినాష్ హడావుడి!

ఈ రోజుల్లో టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ సెలబ్రెటీలకు సోషల్ మీడియాలలో ఎంతగా క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారి పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు కూడా నిత్యం హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటాయి. ఇక జబర్దస్త్ ద్వారా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకున్న ముక్కు అవినాష్ ఆ తర్వాత బిగ్ బాస్ షోలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇచ్చి మరో స్థాయిలో గుర్తింపు అందుకున్నాడు.

ఇక హౌస్ లో అందరితో కలిసిమెలిసి ఉన్న అవినాష్ ముఖ్యంగా అరియానా గ్లోరీతో తో ఒక ప్రత్యేకమైన రొమాంటిక్ ట్రాక్ అయితే నడిపాడు. ఇక బయటికి వచ్చిన తర్వాత కూడా అరియాణతో అవినాష్ మంచి స్నేహాన్ని కొనసాగించాడు. అయితే వారు కేవలం ఎంటర్టైన్మెంట్ పరంగానే ఒక ప్రత్యేకమైన రిలేషన్ తో మెయింటెన్ చేస్తూ వచ్చారు. కానీ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ అయితే చాలానే వచ్చాయి. ఇక అవినాష్ అనూజ అనే తన కుటుంబ సభ్యులు అమ్మాయిని పెళ్ళి చేసుకోవడానికి సిద్ధం కావడంతో ఆ రూమర్స్ అన్నీ అబద్ధాలు అని తేలిపోయింది.

ఇక కొన్ని వారాల క్రితం అమ్మాయి వారి ఇంట్లోనే సింపుల్ గా నిశ్చితార్థం చేసుకున్న అవినాష్ ఇప్పుడు తన పెళ్లి వేడుకలను కూడా మొదలెట్టేశాడు. ఇటీవల హల్దీ వేడుకతో కూడా మరొకసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచాడు. తన కుటుంబ సభ్యుల సమక్షంలో సంతోషంగా హల్దీ వేడుకను జరుపుకున్నట్లు తెలుస్తోంది. వేడుకకు సంబంధించిన ప్రత్యేకమైన ఫోటోలతో సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నాడు.

1

2

3

4

5

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus