Avinesh wedding photos: వైభవంగా ముక్కు అవినాష్ పెళ్లి, వైరల్ అవుతున్న పెళ్లి ఫొటోలు!

జబర్దస్త్ షో ద్వారా కమెడియన్ గా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న అవినాష్ బిగ్ బాస్ షో సీజన్ 4 ద్వారా మరింత పాపులర్ అయ్యారు. ప్రస్తుతం అవినాష్ స్టార్ మా ఛానెల్ లో ప్రసారమవుతున్న కామెడీ స్టార్స్ షోలో కమెడియన్ గా కొనసాగుతున్నారు. ఈరోజు ముక్కు అవినాష్ వివాహ వేడుక ఘనంగా జరిగింది. తన బాల్య స్నేహితురాలైన అనూజను ముక్కు అవినాష్ వివాహం చేసుకున్నారు. ఈరోజు అనూజ మెడలో మూడు ముళ్లు వేసి అవినాష్ ఒక ఇంటివాడయ్యారు.

అంగరంగ వైభవంగా ముక్కు అవినాష్ వివాహ వేడుక జరగగా బిగ్ బాస్ కంటెస్టెంట్లతో పాటు బుల్లితెర నటులు ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. సోహైల్, అరియానా, దివి పెళ్లి వేడుకలో సందడి చేశారు. అవినాష్ పెళ్లి జరగడంతో సోషల్ మీడియా వేదికగా అతని అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. బిగ్ బాస్ కంటెస్టెంట్లు సోషల్ మీడియా వేదికగా అవినాష్ పెళ్లి ఫోటోలను, వీడియోలను అభిమానులతో పంచుకుంటున్నారు. టాలెంట్ తో ఎదిగిన అవినాష్ కెరీర్ లో ఇబ్బందులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందడుగులు వేస్తూ కెరీర్ ను ప్లాన్ చేసుకున్నారు.

గత సీజన్ లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ప్రేక్షకులకు భారీస్థాయిలో ఎంటర్టైన్మెంట్ ను అందించారు. బిగ్ బాస్ షో ద్వారా అవినాష్ ఆర్థికంగా స్థిరపడ్డాడని వార్తలు వచ్చాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనడం కోసం అవినాష్ జబర్దస్త్ నిర్వాహకులకు పది లక్షలు చెల్లించారు. అవినాష్ పెళ్లి చేసుకోవడంతో పెళ్లి కాని బిగ్ బాస్ కంటెస్టెంట్ల పెళ్లెప్పుడు? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

మహా సముద్రం సినిమా రివ్యూ & రేటింగ్!
ఒక్కో సినిమాకు ఈ స్టార్ హీరోలు ఎంతెంత డిమాండ్ చేస్తున్నారో తెలుసా?
టాలీవుడ్ లో బి.టెక్ చదువుకున్న 10 మంది లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus