ప్రముఖ సినీ నటుడు మురళీ మోహన్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల గురించి మాట్లాడుతూ షాకింగ్ కామెంట్లు చేశారు. ఇప్పటికే ఐదుగురు సినీ ప్రముఖులు ‘మా’ ఎన్నికలలో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు ప్రకటించగా మురళీ మోహన్ గతంలో మా మెంబర్స్ తక్కువగా ఉండేవారని అప్పట్లో పద్ధతిగా ఉండేదని కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఎవరికి పడితే వారికి మా సభ్యత్వం దక్కుతోందని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం ఎవరు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబరో ఎవరు కాదో తెలిసే పరిస్థితి లేదని పాత రోజులు మళ్లీ వస్తే బాగుంటుందని మురళీమోహన్ పేర్కొన్నారు. గాడి తప్పిన ‘మా’ను సరైన ట్రాక్ లో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎంపిక చేసి మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నామని మురళీ మోహన్ చెప్పుకొచ్చారు. ‘మా’లో కొన్ని విధానాలు మారాలని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు.
తాను, చిరంజీవి గారు, మోహన్ బాబు గారు, జయసుధ గారు, కృష్ణంరాజు గారు సిట్టింగ్ లు జరిపి ‘మా’ను గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నామని మురళీమోహన్ అన్నారు. ఎన్నికలు జరిగితే గొడవలు వస్తాయని అందుకే అందరినీ ఒప్పించి ఏకగ్రీవం చేస్తామని మురళీ మోహన్ వెల్లడించారు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసి ‘మా’ను కుక్కలు చింపిన విస్తరి చేయొద్దని మురళీ మోహన్ తెలిపారు. ‘మా’ అధ్యక్ష పదవి అంటే హోదా మాత్రమేనని దాని వల్ల వచ్చేది ఏం ఉండదని మురళీ మోహన్ అభిప్రాయపడ్డారు. మురళీ మోహన్ చేసిన కామెంట్లు అధ్యక్ష పదవికి పోటీ చేసేవాళ్లకు షాక్ అనే చెప్పాలి.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!