అహ్మదాబాద్లో లొకేషన్ కోసం తిరుగుతున్న మురుగదాస్
- September 29, 2016 / 12:14 PM ISTByFilmy Focus
సూపర్ స్టార్ మహేష్ బాబు, కమర్షియల్ డైరక్టర్ మురుగదాస్ కాంబినేషన్లో, ఏక కాలంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్నమూవీ రెండు షెడ్యూల్స్ విజయవంతంగా పూర్తి చేసింది. ఇన్వెస్ట్ గేషన్ ఆఫీసర్ గా ప్రిన్స్ నటిస్తున్న ఈ చిత్రంలో విలన్ గా తమిళ దర్శకుడు, నటుడు ఎస్.జె.సూర్య ఆకట్టుకోనున్నారు. భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మూవీ మూడో షెడ్యూల్ గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో జరగనుంది. ఆ ప్రాంతంలో మంచి లొకేషన్ కోసం దర్శకుడు మురుగదాస్, సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ తో కలిసి వేట మొదలెట్టారు.
ఈ విషయాన్నీ సంతోష్ శివన్ ట్విట్టర్ వేదికపై వెల్లడించారు. స్థానిక హోటల్ ల్లో టీ తాగుతున్న ఫోటోను అయన పోస్ట్ చేశారు. హరీష్ జయరాజ్ సంగీతాన్ని అందిస్తున్నఈ సినిమా ఫస్ట్ లుక్ దీపావళికి విడుదల కానుంది. జనవరి నాటికీ షూటింగ్ కంప్లీట్ చేసి, సంక్రాంతికి టీజర్ విడుదల చేయాలనీ మురుగ దాస్ భావిస్తున్నారు.
Location scout in Ahemedabad pic.twitter.com/0r3AKjcw35
— SantoshSivanASC. ISC (@santoshsivan) September 29, 2016
















