Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Featured Stories » ఇప్పుడు మెసేజులు చెప్తామంటే జనాలు థియేటర్లకి రావడం లేదు – ఎ.ఆర్‌.మురుగదాస్‌

ఇప్పుడు మెసేజులు చెప్తామంటే జనాలు థియేటర్లకి రావడం లేదు – ఎ.ఆర్‌.మురుగదాస్‌

  • August 22, 2017 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఇప్పుడు మెసేజులు చెప్తామంటే జనాలు థియేటర్లకి రావడం లేదు – ఎ.ఆర్‌.మురుగదాస్‌

దర్శకుడిగా మురుగదాస్ స్థాయి వేరు, సౌత్ సినిమాని ప్రపంచస్థాయికి పరిచయం చేయడంతోపాటు.. బాలీవుడ్ కి తొలి వంద కోట్ల చిత్రాన్ని అందించిన ఘనత మురుగదాస్ సొంతం. అటువంటి ఘనమైన గుర్తింపు ఉన్న మురుగదాస్ ‘స్టాలిన్” అనంతరం దాదాపు పదేళ్ళ గ్యాప్ తో తెలుగులో చేస్తున్న స్ట్రయిట్ సినిమా “స్పైడర్” తెలుగుతోపాటు తమిళంలోనూ ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం తెలుగు-తమిళం-మలయాళం-అరబిక్ బాషల్లో సెప్టెంబర్ 27న విడుదలకానుంది. మహేష్ బాబు-రకుల్ ప్రీత్ జంటగా నటించిన ఈ చిత్రంలో మహేష్ ఓ స్పెషల్ ఆఫీసర్ గా నటించడం విశేషం. సినిమా విడుదల దగ్గర పడుతుండడంతో.. “స్పైడర్” విశేషాలు మీడియాతో పంచుకొన్నారు దర్శకులు మురుగదాస్. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..!!

పదేళ్ళ తర్వాత నేను చేస్తున్న స్ట్రయిట్ తెలుగు సినిమా… “స్టాలిన్‌” తర్వాత పదేళ్లకు నేను చేస్తున్న స్ట్రయిట్‌ తెలుగు మూవీ. నేను విజయవాడలో ‘ఒక్కడు’ సినిమా చూశాను. సినిమా విడుదలై రెండు వారాలైనా థియేటర్‌లో పండగలా ఉంది. క్యాజువల్‌గా మహేష్‌ చూపించిన సెటిల్డ్‌ పెర్ఫామెన్స్‌ నాకు బాగా నచ్చింది. తర్వాత స్టాలిన్‌ సినిమా చేస్తున్నప్పుడు పక్కనే పోకిరి సినిమా సాంగ్‌ షూట్‌ జరుగుతోంది. అప్పుడు పరుచూరి వెంకటేశ్వరరావుగారు మహేష్‌ను పరిచయం చేశారు. తర్వాత కొన్ని రోజులకు మహేష్‌ను కలిసినప్పుడు నేను మీతో సినిమా చేయాలనుకుంటున్నానండి.. అని అన్నాను. తను కూడా పాజిటివ్‌గానే రియాక్ట్‌ అయ్యారు. అయితే తర్వాత నేను గజినీతో హిందీ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాను. బిజీ అయ్యాను. తెలుగు, తమిళంలో ఓ సినిమా చేయాలనుకోగానే ఈ కథను అనుకున్నాం. కథలో హీరోయిజం ఉండాలి. ఫ్యామిలీ ఆడియెన్స్‌, ఫ్యాన్స్‌, రెగ్యులర్‌ ఆడియెన్స్‌కు సినిమా నచ్చేలా ఉండాలి. అలాగే తమిళంలో కూడా మహేష్‌ చేస్తున్న స్ట్రయిట్‌ మూవీ కాబట్టి బేలెన్సింగ్‌ కూడా కరెక్ట్‌గా ఉండాలి. కాబట్టి స్క్రిప్ట్‌ మోడ్రన్‌గా ఉండాలని నిర్ణయించుకున్నాం. తెలుగు, తమిళంలో డబ్బింగ్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఒక సాంగ్‌ మినహా సినిమా పూర్తయ్యింది. పదేళ్లు వెయిట్‌ చేసినందుకు తగ్గ సినిమా చేసినట్లు అనిపించింది. డెఫనెట్‌గా తెలుగు, తమిళ ఆడియెన్స్‌ను అలరిస్తుందని చెప్పగలను.

మహేష్ లా మరెవ్వరూ కష్టపడరు…  నేను చాలా మంది సూపర్‌స్టార్స్‌తో పనిచేశాను. మహేష్‌ వర్కింగ్‌ స్టైల్‌ను మరొకరితో కంపేర్‌ చేయలేను. అందరు దర్శకులు మహేష్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఏడాదిగా మహేష్‌తో ట్రావెల్‌ చేస్తున్నాను. తన లాంటి హీరోను ఇంత వరకు చూడలేదు. తను దర్శకుల హీరో. స్పైడర్‌ సినిమాను 80 రోజులు పాటు రాత్రి షూటింగ్స్‌ చేశాం. తను ఎంతో కోఆపరేటివ్‌గా వుండేవారు. స్క్రిప్ట్‌ విన్న తర్వాత తనెక్కడా ఇన్‌వాల్వ్‌ కాలేదు. చాలా ఎఫర్ట్‌ పెట్టి సినిమాలో నటించారు. ఇండియాలో మరే సూపర్‌స్టార్‌ ఇంతలా కష్టపడటం నేను చూడలేదు. చాలా సపోర్ట్‌ చేశారు. మీరు ఫైనల్‌ అవుట్‌పుట్‌ చూడండి. మీకు మరో ఐదారు సీన్స్‌ యాడ్‌ చేయాలంటే చేయండి. నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు అయిపోందని చెబితే నా నెక్స్‌ట్‌ మూవీకి వెళతాను. నేను చాలా ఎగ్జయిట్‌ అయ్యాను. స్పైడర్‌ సినిమాలో మహేష్‌గారిని తప్ప మరే హీరోను ఊహించుకోలేనంతగా ఇమిడిపోయారు. సినిమాను రెండు భాషల్లో సమాంతరంగా షూట్‌ చేశాం. ఎన్ని టేక్స్‌ అయినా చాలా కూల్‌గా ఉండి పూర్తి సహకారాన్ని అందించారు.

చాలా ఇంటెలిజెంట్ సినిమా… స్పైడర్‌ జేమ్స్‌బాండ్‌ తరహాలో పూర్తిస్థాయి ఫ్యూచెరిస్టిక్‌ మూవీ కాదు. స్పై మూవీ. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇంటెలిజెన్స్‌ వ్యవస్థ మన దేశంలో ఎలా పనిచేస్తుంది. వారు దేశంలో మన కోసం ఏం చేస్తున్నారు అనేవి సినిమాలో చూపిస్తున్నాం. సినిమాలో ఎమోషన్స్‌ ఉంటాయి. సాధారణంగా నా సినిమాల్లో డైరెక్ట్‌ మెసేజ్‌ లేక ఇన్‌డైరెక్ట్‌ మెసేజ్‌లుంటాయి. స్పైడర్‌లో కూడా హ్యుమానిటీకి సంబంధించిన మెసేజ్‌తో ఉంటుంది. మనిషిలో హ్యుమానిటీ తగ్గిపోయినప్పుడు సోసైటీలో లంచం పెరిగిపోతుంది లేదా మరేదైనా వైపరీత్యం సంభవిస్తుంది. ఈ మెసేజ్‌ను నేను ఇన్‌డైరెక్ట్‌గా ఈ సినిమాలో చూపిస్తున్నాను.

అలా చేస్తే ఇంకా లేట్ అయ్యేది… సినిమా ప్రారంభంలోనే తెలుగు, తమిళంలోనే చేయాలనుకున్నాం. హిందీలో చేయమాలనుకోలేదు. తెలుగు, తమిళంలో ఏకకాలంలో షూట్‌ చేయడం వల్ల నేను వేసిన ప్లానింగ్‌ కంటే షూటింగ్‌కు ఎక్కువ రోజుల సమయం పట్టింది. ఒకేసారి రెండు భాషల్లో సినిమా చేయడం నాకు మొదటిసారి. రెండు భాషల్లో అయితే మేనేజ్‌ చెయ్యవచ్చు.

వాళ్ళు లేకపోతే స్పైడర్ లేదు… నేను, మహేష్‌ కలిసి సినిమా చేస్తున్నామంటే ఖచ్చితంగా భారీ బడ్జెట్‌ సినిమాగానే ఉంటుంది. కాబట్టి సినిమాను ప్రేమించే నిర్మాతలు అవసరం. ఠాగూర్‌, గజినీ, కత్తి సినిమాల నుండి ఠాగూర్‌ మధుగారితో పదేళ్ల పరిచయం ఉంది. అలాగే తిరుపతి ప్రసాద్‌గారితో కూడా చాలా కాలంగా అనుబంధం ఉంది. ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు మహేష్‌గారు ఠాగూర్‌ మధు, తిరుపతి ప్రసాద్‌గారైతే నిర్మాతలు ఎలా ఉంటుందని నన్ను అడిగారు. వారితో నాకు చాలా కాలంగా ఉన్న మంచి అనుబంధంతో నేను ఎస్‌ చెప్పాను. సినిమా స్టార్ట్‌ అయిన తర్వాత మేం అనుకున్న దానికంటే గ్రాండియర్‌ ఇంకా ఎక్కువైంది. బెటర్‌గా చేద్దామని, నిర్మాతలిద్దరూ నాకు సపోర్ట్‌ చేశారు. గ్రాఫిక్స్‌ను కూడా లండన్‌, రష్యా టెక్నిషియన్స్‌తో చేయిస్తున్నారు. ప్రతి విషయంలో నిర్మాతలు చాలా కేర్‌ తీసుకుని పిల్లర్స్‌లా సినిమాను ప్రేమించి చేశారు.

పరిణీతిని తీసుకోకపోవడానికి కారణం అదే… అనుకున్నమాట నిజమే. అయితే సినిమాను రెండు భాషల్లో ఏకకాలంలో తీయాలనుకున్నప్పుడు రెండు భాషలు తెలిసిన హీరోయిన్‌ కావాలనిపించింది. పరిణితి చోప్రా ముంబై అమ్మాయి తెలుగు, తమిళం రెండు భాషలు రావు. రెండు భాషల్లో భాష రాని అమ్మాయిని హీరోయిన్‌గా మెనేజ్‌ చేయడం కష్టం. అలాంటప్పుడు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అయితే రెండు భాషలను అర్థం చేసుకుంటుందని చెప్పడంతో మేం రకుల్‌ని హీరోయిన్‌గా తీసుకున్నాం.

మహేష్ బాబుతో ఫైట్ చేయడానికి సూర్య కరెక్ట్ అనిపించాడు… విలన్‌ అంటే ఆరడుగులు, ఆరు పలకల దేహం ఉండాల్సిన అవసరం లేదు. మా కథకు తగినట్లుగా బుద్ధి బలం ఎక్కువగా ఉండే విలనిజం కనిపించాలి. హీరోకు కనిపించకుండా గెరిల్లా ఎటాక్‌లా హీరోతో ఫైట్‌ చేయాలి. అందుకు ఎస్‌.జె.సూర్య అయితే యాప్ట్‌ అవుతాడనిపించింది. అదీ కాక నేను సూర్య మంచి స్నేహితులం. కెరీర్‌ ప్రారంభంలో దర్శకత్వ శాఖలో ఇద్దరం కలిసి పనిచేశాం. ఎస్‌.జె.సూర్య డైరెక్ట్‌ చేసిన ‘ఖుషీ’ చిత్రానికి దర్శకత్వ శాఖలో నేను 15-20 రోజుల పాటు పనిచేశాను. భరత్‌ కూడా ఈ సినిమాలో విలన్‌గా నటించాడు. తన పాత్ర గురించి ఇప్పుడు చెబితే సస్పెన్స్‌ పోతుంది.

మెసేజ్ విని విని ఆడియన్స్ బోర్ అయిపోయారు… ప్రజలు నిద్ర లేచినప్పటి నుండి ఏదో మెసేజ్‌ తీసుకుంటూనే ఉంటారు. ఓ రకంగా చెప్పాలంటే ప్రజలకు మెసేజ్‌లంటే విరక్తి వచ్చింది. అందుకే ఇంతకు ముందు చెప్పినట్లు స్పైడర్‌లో ఇన్‌డైరెక్ట్‌గా మెసేజ్‌ ఉంటుంది. నేను డైరెక్ట్‌ చేసిన రమణ(తెలుగులో ఠాగూర్‌) మూవీలో మెసేజ్‌ ఉంటుంది. చాలా పెద్ద హిట్‌ అయ్యింది. అయితే ఎక్కడా జాతీయగీతం, జాతీయ పతాకం, వందేమాతర గీతం వంటి అంశాలు కనపడవు. దేశభక్తి సినిమా అయినంత మాత్రాన సినిమాలో పైన చెప్పిన అంశాలు ఉండాలనేం లేదు. ఈ సినిమాలో కూడా మెసేజ్‌ ఉంటుంది. మెసేజ్‌ కంటే ముందు సినిమాలో మనం చెప్పే విషయాలు ఆడియెన్స్‌ను పాడు చేయకూడదు. మంచి మెసేజ్‌ ఇవ్వకపోయినా, తప్పుడు మెసేజ్‌ మాత్రం ఇవ్వకూడదు. ఉదాహరణకు మహేష్‌లాంటి ఫాలోయింగ్‌ ఉన్న హీరో సినిమాలో సిగరెట్‌ త్రాగుతూ కనపడితే ఆయన వీరాభిమాని గుడ్డిగా ఆయన్ను ఫాలో కావడానికి ప్రయత్నిస్తాడు. అలాంటి సన్నివేశాలు ఈ సినిమాలో కనపడవు. సినిమాలు ప్రజలపై ప్రభావం చూపుతాయి. సినిమాలనే కాదు, మీడియా తప్పకుండా ప్రభావం చూపుతుంది. సినిమా ఇంపాక్ట్‌ చూపాలి. ఆ ప్రభావం బాధ్యతతో కూడుకున్నదై ఉండాలి.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #A.R. Murugadoss interview
  • #A.R. Murugadoss movies
  • #mahesh
  • #Murugadoss
  • #Spyder

Also Read

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

Akhanda 2: ‘అఖండ 2’ రిలీజ్ కి లైన్ క్లియర్..!

related news

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

trending news

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

1 hour ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

2 hours ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

2 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

3 hours ago
Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

4 hours ago

latest news

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

4 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

5 hours ago
Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

Rashmika: ఫిబ్రవరిలో పెళ్లి.. ఇదేం రియాక్షన్‌ రష్మిక? ఇలా కూడా చెబుతారా?

6 hours ago
అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

అప్పుడు మిస్‌ అయిన సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌ వస్తోంది.. ఏ సినిమానో తెలుసా?

6 hours ago
Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

Pushpa 2 Premiere Stampede: పుష్ప తొక్కిసలాటకి ఏడాది.. శ్రీ తేజ్ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే…?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version