Ravi Basrur: తారక్ పై అభిమానాన్ని చాటుకున్న రవి బస్రూర్.. ఏం చేశారంటే?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  ప్రశాంత్ నీల్  (Prashanth Neel) కాంబో మూవీ షూట్ ఈ ఏడాదే మొదలుకానుంది. డిసెంబర్ నెల నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూట్ లో తారక్ నటించనున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రతి సినిమాకు రవి బస్రూర్ (Ravi Basrur) మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. రవి బస్రూర్ స్టూడియోకు తారక్, ప్రశాంత్ నీల్, రిషబ్ శెట్టి  (Rishab Shetty)  వెళ్లగా రవి బస్రూర్ తారక్ తన స్టూడియోకు రావడంతో అభిమానాన్ని చాటుకున్నారు.

Ravi Basrur

“వీడు కంట పడితే నీడకైనా చెమటలే” అనే లిరిక్స్ తో సాగే పాటను రవి బస్రూర్ కంపోజ్ చేశారు. ఈ పాటలో ఎన్టీఆర్ అనే పేరు వినిపించడం అభిమానులకు మరింత సంతోషాన్ని కలిగిస్తోందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ వీడియోను సోషల్ మీడియా వేదికగా తెగ షేర్ చేస్తున్నారు. రవి బస్రూర్ కు తారక్ అంటే ఎంతో అభిమానం అని సమాచారం అందుతోంది.

సాధారణంగా స్టార్ హీరోలకు అభిమానులు ఉంటారు. అయితే ప్రముఖ నటులు, టెక్నీషియన్లు సైతం ఎన్టీఆర్ కు అభిమానులుగా ఉండటం గమనార్హం. రవి బస్రూర్ (Ravi Basrur) తారక్ ప్రశాంత్ సినిమాకు ఎలాంటి మ్యూజిక్ ఇస్తారో చూడాల్సి ఉంది. ప్రశాంత్ నీల్ అంటే రవి బస్రూర్ కు సైతం ప్రత్యేకమైన అభిమానం ఉందనే సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ప్రశాంత్ కాంబో సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఆర్.ఆర్.ఆర్ (RRR) మూవీతో తారక్ క్రేజ్ అమాంతం పెరగగా దేవర (Devara) , వార్2 సినిమాలు ఎన్టీఆర్ కెరీర్ లో స్పెషల్ సినిమాలుగా నిలవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలు సక్సెస్ సాధిస్తే పాన్ ఇండియా స్థాయిలో తారక్ పేరు మారుమ్రోగే అవకాశం ఉంది. దేవర సినిమా హిందీ కలెక్షన్లు ఏ రేంజ్ లో ఉండనున్నాయో చూడాలి. దేవర కాన్సెప్ట్ కొత్తగా ఉంటుందని ప్రేక్షకుల ఊహలకు భిన్నంగా ఈ సినిమా కథ, కథనం ఉండనున్నాయని తెలుస్తోంది.

కొడుకు సినీరంగ ప్రవేశం పై సుధీర్ బాబు క్లారిటీ.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus