సాలూరి కోటేశ్వరరావు (కోటిగా సుపరిచితం) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని తండ్రి సాలూరి రాజేశ్వరరావు కూడా సంగీత దర్శకుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడు చక్రవర్తి వద్ద సహాయకుడిగా పనిచేశాడు. తరువాత ఈయన, మరో సంగీత దర్శకుడు టి.వి. రాజు కొడుకైన రాజ్ జంటగా రాజ్ – కోటి పేరుతో సంగీత దర్శకత్వం వహించారు. కొద్ది కాలానికి ఇద్దరూ విడిపోయినా కోటి ఒక్కడే సంగీతం సమకూర్చి తనదైన శైలిని ఏర్పరుచుకున్నాడు.
హలో బ్రదర్ సినిమాకు గాను 1994 లో నంది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ప్రముఖ సంగీత దర్శకులైన మణిశర్మ, ఏ. ఆర్. రెహ్మాన్ కోటి దగ్గర శిష్యురికం చేశారు. ఇక కోటి చిరంజీవి, బాలకృష్ణ వంటి అందరు అగ్ర హీరోలకూ మ్యూజిక్ చేస్తూ ఎన్నో హిట్స్ అందుకున్నారు. ప్రస్తుతం సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవడం వల్ల గ్యాప్ తీసుకున్న కోటి గారు తాజాగా ఒక ఇంటర్వ్యూలో దాసరి నారాయణ రావు గారితో ఉన్న అనుబంధం గురించి వివరించారు.
దాసరి గారి ప్రతి సినిమాకు కోటి గారు మ్యూజిక్ చేసారు. దాసరి నారాయణ రావు గారు కోటి తండ్రి సాలూరి రాజేశ్వరరావు గారితో పనిచేసినపుడు కూడా కోటి గారిని చాలా ప్రేమగా మాట్లాడించేవారట. అలాంటి దాసరి గారికి పక్కన ఉన్న వాళ్ళు కోటి గురించి తప్పుగా చెప్పడం వల్ల శ్రీహరి గారితో తీసిన ‘మేస్త్రి’ సినిమా తరువాత సినిమా చేయలేదట.
కారణాలు పెద్దగా తెలియదు కానీ ఆయన నన్ను దూరం పెట్టాడు అంటూ (Music Director) కోటి గారు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక మళ్ళీ దాసరి గారు ఆయన సినిమాల్లో కోటి గారిని తీసుకోలేదట. ఇక మళ్ళీ దాసరి గారితో మాట్లాడటం కానీ, కలవడం కానీ జరగలేదని కోటి గారు తెలిపారు. చనిపోయినపుడు కూడా అమెరికాలో ఉండటం వల్ల రాలేకపోయాను, చివరిసారిగా చూడలేక పోయాను, ఆయన నా కెరీర్ లో నన్ను చాలా ప్రోత్సాహించిన వారిలో ఒకరు అంటూ తెలిపారు.