ఈ ఏడాది విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలలో ఎక్కువ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. పలు భారీ బడ్జెట్ సినిమాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయని నిర్మాతలు వెల్లడించినా వాస్తవ పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం నిర్మాతలకు థియేట్రికల్ కలెక్షన్ల ద్వారా వస్తున్న ఆదాయంతో పోల్చి చూస్తే శాటిలైట్, డిజిటల్ హక్కుల ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం వస్తోంది. హీరోలు ఎక్కువ మొత్తంలో రెమ్యునరేషన్లను డిమాండ్ చేయడం కూడా ఈ పరిస్థితికి కారణమని కొంతమంది భావిస్తున్నారు.
అయితే తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కార్యదర్శి ముత్యాల రమేశ్ వాస్తవ పరిస్థితులను వెల్లడించడంతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉందని ఆయన అన్నారు. అందరు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హీరోలు మాత్రమే సంతోషంగా ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. డిస్ట్రిబ్యూటర్లు సైతం ఫేక్ కలెక్షన్లు చెప్పడం ద్వారా హీరోల స్థాయిని పెంచుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విధంగా జరగడం వల్ల హీరోల రెమ్యునరేషన్లు పెరుగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు.
ఇప్పటికైనా డిస్ట్రిబ్యూటర్లు కళ్లు తెరిచి వాస్తవాలను బయటపెట్టాలని ఆయన సూచనలు చేశారు. డిస్ట్రిబ్యూటర్లు నిజాలను వెల్లడిస్తే మాత్రమే హీరోలు కంట్రోల్ లో ఉంటారని ఆయన చెప్పుకొచ్చారు. ముత్యాల రమేష్ చేసిన కామెంట్లు నిజమేనని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా మరి కొందరు మాత్రం వాస్తవ పరిస్థితులకు వేర్వేరు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. థియేటర్లలో సినిమాలు చూడటానికి ప్రేక్షకులు ఆసక్తి చూపకపోవడం గురించి టాలీవుడ్ నిర్మాతలు ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
పరిస్థితులు ఇదే విధంగా కొనసాగితే సినిమాలను నిర్మించే నిర్మాతల సంఖ్య తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే షూటింగ్ మొదలైన సినిమాల బడ్జెట్లను తగ్గిస్తే ఇండస్ట్రీకి మేలు జరిగే అవకాశం అయితే ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Most Recommended Video
ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!