మెగాస్టార్ చిరంజీవి తనయుడుగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన రాంచరణ్ ఇప్పుడు పెద్ద స్టార్ హీరోగా ఎదిగాడు. నెంబర్ వన్ రేసింగ్ హీరోల్లో చరణ్ కూడా ఉన్నాడు.చిరు లాగే డ్యాన్సుల్లోనూ, ఫైట్లల్లోనూ గ్రేస్ చూపిస్తూ ఉంటాడు. ’10 ఏళ్ళు సినిమాలకు దూరంగా ఉన్నాను అంటే… రాంచరణ్ ఆ రేంజ్లో రాణించడం వల్లే… నాకు అది పెద్ద ఎచీవ్మెంట్ గా భావిస్తాను’ అని చిరు ఎన్నో సార్లు చెప్పాడు. చరణ్, చిరు తండ్రీ కొడుకుల్లా కాదు బ్రదర్స్ మరియు ఫ్రెండ్స్ లా ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే తండ్రి అన్నాక పిల్లలను కొట్టకుండా ఉంటారా.
చరణ్ ను కూడా చిరంజీవి రెండు సందర్భాల్లో చెయ్యి చేసుకున్నారట. ఒకసారి అయితే బెల్ట్ తీసుకుని మరీ కొట్టాడట. చరణ్ చిన్న వయసులో ఉన్నప్పుడు.. వారి ఇంటి వాచ్ మెన్ వేరే వ్యక్తిని బూతులు తిడుతూ ఉన్నాడట. ఆ పక్కనే ఆడుకుంటున్న చరణ్ ఆ మాటలు విని.. వెళ్ళి తన పెద బాబాయ్ అయిన నాగ బాబు దగ్గర అన్నాడట. వాటికి అర్థం ఏంటి అని తర్వాత ప్రశ్నించాడట. దాంతో నాగ బాబు … షాక్ కు గురయ్యి… చరణ్ ను చిరు రూమ్ కు తీసుకువెళ్ళాడట.
అప్పుడే షూటింగ్ ముగించుకుని వచ్చిన చిరు… విషయం తెలుసుకుని .. తన తండ్రి బహుమతిగా ఇచ్చిన బెల్ట్ తో చితక్కొట్టాడట. ఆ తరువాత చరణ్ ను దగ్గరకు తీసుకుని ‘అది తప్పుడు బాష.. అలా ఎప్పుడూ మాట్లాడకూడదు’ అని చెప్పాడట. ఇక రెండో సందర్భం ఏంటి అంటే.. చరణ్ టీనేజ్ కు ఎంటర్ అవుతున్న రోజుల్లో.. వచ్చిన కాస్త గడ్డాన్ని షేవ్ చేసుకుంటూ.. ఘాటు పెట్టుకున్నాడట. బ్లడ్ కారుతున్న టైం లో చిరు వచ్చి చరణ్ కు ఒక్కటి తగిలించారట. తరువాత దగ్గరకు తీసుకుని తిట్లు తిట్టి మరీ ఫస్ట్ ఎయిడ్ చేసారని తెలుస్తుంది. ఇలా ఈ రెండు సందర్భాల్లో చరణ్ … చిరు చేతిలో దెబ్బలు తిన్నాడని తెలుస్తుంది.