మెగాహీరోకి మరో కోటి రూపాయలిచ్చిన మైత్రి!

  • February 26, 2021 / 05:41 PM IST

మెగాస్టార్ చిన్న మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఏ డెబ్యూ హీరోకి రానన్ని కలెక్షన్స్ ఈ సినిమాకి రావడం విశేషం. ఈ సినిమాతో బుచ్చిబాబు సానా దర్శకుడిగా, కృతిశెట్టి హీరోయిన్ గా తెలుగు తెరకి పరిచయమైంది. ఇప్పుడు ఈ సినిమా సక్సెస్ ని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటుంది మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ.

సాధారణంగా తమ బ్యానర్ లో తెరకెక్కే సినిమాలు బ్లాక్ బస్టర్లు అందుకుంటే యూనిట్ కి గిఫ్ట్ లు ఇవ్వడం మైత్రి సంస్థకి అలవాటు. గతంలో కొరటాల శివ లాంటి దర్శకులకు విలువైల బహుమతులు అందించింది. ఇప్పుడు ‘ఉప్పెన’ టీమ్ కి కూడా కానుకలు ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకుడు బుచ్చిబాబు సానాకి ఖరీదైన ఇల్లు కావాలా..? లేక కారు కావాలా..? అని ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు హీరో, హీరోయిన్ల వంతొచ్చింది.

హీరో వైష్ణవ్ తేజ్ కి రెమ్యునరేషన్ కాకుండా రూ.కోటి రూపాయలు అదనంగా ఇవ్వనున్నారట. అలానే హీరోయిన్ కృతిశెట్టికి పాతిక లక్షలు బహుమతిగా ఇవ్వనున్నారు. ఈ రేంజ్ లో గిఫ్ట్స్ ఇవ్వడం మామూలు విషయం కాదు. ఫ్యూచర్ లో కూడా మైత్రి సంస్థ ఇలానే గిఫ్ట్ లు ఇవ్వడం కంటిన్యూ చేస్తుందేమో చూడాలి!

Most Recommended Video

చెక్ సినిమా రివ్యూ & రేటింగ్!
అక్షర సినిమా రివ్యూ & రేటింగ్!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus