“‘మైత్రి మూవీ మేకర్స్’ అనే ప్రొడక్షన్ హౌస్లో కనుక మీరు చూసుకుంటే.. సమంత (Samantha) గారు మా బ్యానర్లో చేసిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) ‘రంగస్థలం’ (Rangasthalam) ‘పుష్ప’ (Pushpa)(పుష్ప : ది రైజ్) ‘ఖుషి’ (Kushi).. ఇప్పుడు మేము రిలీజ్ చేసిన ‘శుభం’ (Subham). సమంత గారు అంటే మా రవి, నవీన్..లకి చాలా గౌరవం. ఆమె ఎంపిక చేసుకునే కథలు జనాలను రంజింపజేస్తూనే ఉన్నాయి. అలా మా నిర్మాణంలో లేదా డిస్ట్రిబ్యూషన్లో సమంత గారు ఇన్వాల్వ్ అయ్యి ఉంటే..
ఆమె మాకు ‘గోల్డెన్ లెగ్’ అని భావిస్తాం” అంటూ ‘మైత్రి డిస్ట్రిబ్యూషన్’ సంస్థ అధినేత అయిన శశి చెప్పుకొచ్చారు. తాజాగా నిర్వహించిన ‘శుభం’ సక్సెస్ సెలబ్రేషన్స్ లో శశి చెప్పిన మాటలు ఇవి. సమంత నిర్మాణంలో రూపొందిన ‘శుభం’ చిత్రాన్ని నైజాంలో ‘మైత్రి’ సంస్థ రిలీజ్ చేసింది. సినిమాకి మంచి టాక్ వచ్చింది. లాభాలు వచ్చినట్టు శశి తెలిపారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ లో రెండో సినిమాగా వచ్చిన ‘జనతా గ్యారేజ్’ లో సమంత (Samantha) సెకండ్ హీరోయిన్ టైపు రోల్ చేసింది.
తర్వాత ‘రంగస్థలం’ లో ఫుల్ లెంగ్త్ హీరోయిన్ అనే సంగతి తెలిసిందే. ఆ తర్వాత అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ లో ‘ఉ అంటావా ఉఊ అంటావా’ అనే స్పెషల్ సాంగ్ చేసింది. అది ప్రపంచం మొత్తం మార్మోగింది. తర్వాత విజయ్ దేవరకొండకి (Vijay Devarakonda) జోడీగా చేసిన ‘ఖుషి’ ని కూడా మైత్రి సంస్థ రిలీజ్ చేసింది. ఆ సినిమా కూడా పర్వాలేదు అనిపించింది.
‘మైత్రి’ లో సమంత భాగమైన ప్రతి సినిమా సూపర్ హిట్ అయ్యింది : మైత్రి శశి#MythriMovieMakers Producer #Sashi #Samantha #Subham pic.twitter.com/0qYRwPQBN3
— Filmy Focus (@FilmyFocus) May 16, 2025