విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) హీరోగా ‘కింగ్డమ్’ (Kingdom) అనే సినిమా రూపొందింది. గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా ఇది. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ(Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. గ్లింప్స్ ఆల్రెడీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి ప్రేక్షకుల నుండి సూపర్ రెస్పాన్స్ లభించింది. ఎన్టీఆర్ (Jr NTR) దానికి వాయిస్ ఓవర్ అందించిన సంగతి తెలిసిందే. అందువల్ల దానికి రీచ్ మరింతగా పెరిగింది.
‘ఈ సినిమా విషయంలో రివ్యూయర్స్ ఎన్ని లాజిక్కులు అయినా వెతికి రివ్యూలు ఇవ్వొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ కె.జి.ఎఫ్ మూవీ, 2 భాగాలుగా మొదలుపెట్టి ఈ సినిమా తీశాము’ అంటూ నిర్మాత నాగవంశీ ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) . ప్రమోషన్స్ లో చెప్పుకొచ్చాడు. అయితే హీరో విజయ్ దేవరకొండ వెర్షన్ మాత్రం వేరుగా ఉంది. ‘కింగ్డమ్’ కథ తనకు ఒక్క పార్ట్ గానే చెప్పాడట దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అతను చెప్పినట్టే సినిమా చేశాడట.
కానీ ‘ఇందులో చాలా రకాల పాత్రలు ఉంటాయట. సినిమా స్పాన్ కూడా పెద్దగా ఉంటుంది. కింగ్డమ్ కి ముందు ఏమైంది? అప్పటి జనాలు ఎలా ఉన్నారు? ఇలా చాలా అంశాలు ఉన్నాయి. కాబట్టి రెండో పార్ట్ అంటూ ఉంటే నేనే హీరోగా చేయాలి అని లేదు. వేరే హీరో కూడా చేసే అవకాశం ఉంది’ అంటూ విజయ్ దేవరకొండ ముంబైలో ఒక మీడియాతో చెప్పుకొచ్చాడు. సో విజయ్ మాటలను బట్టి రెండో భాగంలో విజయ్ హీరోగా చేయకపోవచ్చు. అలాగే సెకండ్ పార్ట్ తో పాటు మూడో పార్ట్ కూడా ఉండొచ్చు.