సంక్రాంతి సినిమాల సీజన్ మొదలైంది. ఇప్పటికే రెండు కొత్త సినిమాలు థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అంతేకాదు థియేటర్ల గొడవ కూడా కొత్త మలుపు తిరిగింది. ఇప్పటివరకు థియేటర్ల పంచాయితీ గురించి వినిపించిన నిర్మాతల చర్చ పక్కకు వెళ్లి థియేటర్ల చైన్ ఓనర్లు, డిస్ట్రిబ్యూటర్ మధ్య చర్చ మొదలై, అదిప్పుడు రచ్చగా మారింది. ఈసారి సెంటరాఫ్ అట్రాక్షన్ పాయింట్ ‘హను – మాన్’ సినిమా కటౌట్. సంక్రాంతి సీజన్‌లో నాలుగు సినిమాలు వస్తున్న సంగతి తెలిసిందే.
ఇందులో ఎక్కువగా వినిపించిన అంశం ‘గుంటూరు కారం’, ‘హను – మాన్’ సినిమాకు థియేటర్లు సర్దుబాటు. మల్టీప్లెక్స్‌ల్లో స్క్రీన్ల విషయంలో కాస్త ఓకే కానీ… తెలంగాణ ప్రాంతంలో సింగిల్ థియేటర్ల విషయంలోనే పెద్ద ఎత్తున చర్చ జరిగింది, జరుగుతోంది కూడా. ఈ క్రమంలో ఓ అగ్ర నిర్మాత పేరు చాలా రోజులు వినిపించింది. ఆయన కాస్త గట్టిగా క్లారిటీ ఇచ్చేసరికి ఇప్పుడు సద్దుమణిగింది. పెద్ద సినిమా అనే పేరుతో ‘గుంటూరు కారం’ సినిమాకే ఎక్కువ థియేటర్లు ఇచ్చి ఉండొచ్చు.
అయితే (Hanu Man) ‘హను – మాన్’కి ఓకే అయిన థియేటర్లు కూడా ‘గుంటూరు కారం’కు ఇచ్చేశారు అని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ చెందిన శశి విమర్శలు చేశారు. అయితే ఇదంతా ఏషియన్ సినిమాస్ వాళ్లతో మైత్రీ వాళ్లకు వచ్చి గ్యాప్ కారణంగానే అని భోగట్టా. అయితే తామేమీ చేయలేదని, ఎవరి అగ్రిమెంట్లను కొ్టటివేయలేదు అని అంటున్నారు. వరంగల్ థియేటర్ కు ‘హను – మాన్’ కటౌట్ పంపిస్తే పెట్టకుండా బయటపెట్టేశారట.
దీనికి సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ విషయంలో ఏషియన్ వాళ్ల వెనుక ఓ నిర్మాత ఉన్నారంటూ విమర్శలు వస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే సంక్రాంతి సినిమాల రచ్చ నడుమ తెలియని రెండు వర్గాలు కథ నడిపిస్తున్నాయని అర్థమవుతోంది. నిర్మాతల మధ్య ఎలాంటి ఇబ్బంది లేకపోయినా కొంతమంది సృష్టించిన పుకార్ల వల్లే ఈ సమస్య వచ్చింది అనేది ఒక వాదన. అలాగే డిస్ట్రిబ్యూటర్ల మధ్య సమస్య కూడా అలా వచ్చిందే అంటున్నారు.
గుంటూరు కారం సినిమా రివ్యూ & రేటింగ్!
హను మాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గుంటూరు కారం’ తో పాటు 24 గంటల్లో రికార్డులు కొల్లగొట్టిన 15 ట్రైలర్ల లిస్ట్..!