బాలీవుడ్ మాస్ హీరో సన్నీ డియోల్ (Sunny Deol), టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని (Gopichand Malineni) కాంబినేషన్‌లో రూపొందిన జాట్ (Jaat) సినిమా ఇటీవలే విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్ 10న విడుదలై వారం రోజుల్లోనే రూ.84 కోట్లకు పైగా వసూలు చేసి, సన్నీకి మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తెచ్చింది. జగపతిబాబు(Jagapathi Babu) , రమ్యకృష్ణ (Ramya Krishnan), రెజీనా (Regina Cassandra) వంటి నటులు కీలక పాత్రల్లో మెరిశారు. అయితే సినిమాకు సంబంధించిన ఓ సన్నివేశం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
మత సంబంధిత అంశాన్ని మిస్‌రిఫ్రెజెంట్ చేశారన్న ఆరోపణలతో ట్రోలింగ్ పెరిగింది. ఈ నేపథ్యంతో మైత్రీ మూవీ మేకర్స్ స్పందించక తప్పలేదు. తాము ఎవరి మనోభావాలను కించపరచే ఉద్దేశంతో ఆ సీన్‌ను చేర్చలేదని, కానీ పబ్లిక్ స్పందనను గమనించి, ఆ సీన్‌ను వెంటనే సినిమా నుంచి తొలగించామని ప్రకటించారు. పబ్లిక్ నుంచి వచ్చిన అభిప్రాయాన్ని గౌరవిస్తూ అధికారికంగా క్షమాపణలు కూడా చెప్పారు. ఈ వ్యవహారం జరిగిన వెంటనే మైత్రీ బ్యానర్ నుంచి జాట్ సీక్వెల్‌పై అధికారిక ప్రకటన రావడం విశేషం.
మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబట్టడంతో, జాట్-2 ని ప్రకటించారు. గోపీచంద్ మలినేనితో కలిసి మైత్రీ మళ్లీ ఈ ప్రాజెక్ట్‌కి ప్లాన్ సిద్ధం చేస్తోంది. అయితే ఇది వెంటనే స్టార్ట్ కాకుండా, గోపీచంద్ మలినేని ప్రస్తుతం బాలకృష్ణతో (Nandamuri Balakrishna) చేయనున్న కొత్త సినిమా తర్వాతే జాట్ 2 సెట్స్ పైకి వెళ్తుందని తెలుస్తోంది.జాట్ 2 లో మరింత హై వోల్టేజ్ యాక్షన్, బలమైన ఎమోషన్, వినోదాన్ని మిళితం చేయనున్నట్లు సమాచారం.
సన్నీ డియోల్ పాత్రకు మరింత డెప్త్ తీసుకువస్తూ, ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్ కూడా చూపించనున్నారని చిత్రబృందం తెలిపింది. మొదటి భాగం కన్నా రెండో పార్ట్ పెద్దదిగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. స్క్రీన్‌ప్లే, ఎమోషనల్ పాయింట్స్‌ను మెరుగుపరిచే పనిలో ఉన్నారు. మొత్తానికి తొలి సినిమా చిన్న వివాదంతో టార్గెట్ అయినా, మైత్రీ మూవీ మేకర్స్ బాధ్యతాయుతంగా స్పందించి, కట్ చేసేందుకు వెనుకాడలేదు. ఇప్పుడు రెండో పార్ట్‌పై అంచనాలు మరింత పెరిగాయి. జాట్ 2 ఎలా ఉంటుందో, మరిన్ని వివరాలు ఎప్పుడు బయటకు వస్తాయో వేచి చూడాలి.
ఏఐతో ఆందోళన తప్పదు.. ఏఆర్ రెహమాన్ కామెంట్స్ వైరల్!