మూడు ఫ్లాప్‌ అయ్యయా… ఈసారైనా హిట్‌ పడతుందా?

దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి… అని చెబుతుంటారు పెద్దలు. అయితే ఆ చక్కబెట్టుకోవడం పద్ధతిగా, పర్‌ఫెక్ట్‌గా ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి. యువ నాయిక నభా నటేశ్‌ను చూస్తే… రెండో మాట గుర్తొస్తుంది. ‘ఇస్మార్ట్‌ శంకర్‌’తో సూపర్‌ హిట్‌ కొట్టి… వావ్‌ అనిపించుకున్న నభా… ఆ తర్వాత మంచి అవకాశాలే సంపాదించుకుంది. అయితే అవి బాక్సాఫీసు దగ్గర సరైన విజయం అందుకోలేకపోయాయి. దీంతో కెరీర్‌ ఇబ్బందుల్లో పడ్డట్లు కనిపించింది. కానీ ఇప్పుడు కోలుకొని సరైన సినిమాకు ఓకే చెప్పిందని తెలుస్తోంది.

‘ఇస్మార్ట్‌ శంకర్‌’కి ముందు నభా నటేశ్ ఓ రెండు సినిమాల్లో చేసింది. ఆ రెండూ బాక్సాఫీసు దగ్గర బోల్తా కొట్టాయి. ‘ఇస్మార్ట్‌…’ తర్వాత చేసిన ‘డిస్కో రాజా’, ‘సోలో బతుకే సో బెటర్‌’, ‘అల్లుడు అదుర్స్‌’ సినిమాలు చేసింది. అందులో ‘సోలో బతుకే సో బెటర్‌’తప్ప మిగిలిన రెండూ ఇబ్బంది పెట్టే ఫలితాన్నే సాధించాయి. దీంతో తర్వాతి సినిమా విషయంలో నభా చాలా జాగ్రత్తలు పాటించిందని తెలుస్తోంది. అందుకే చాలా ఆలోచించి నాగచైతన్య కొత్త సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు.

అవును నాగచైతన్య కథానాయకుడిగా విక్రమ్‌ కె.కుమార్‌ తెరకెక్కిస్తున్న ‘థాంక్యూ’లో నభా ఓ నాయికగా నటిస్తోందని తెలుస్తోంది. ఇప్పటికే ఓ నాయికగా అవికా గోర్‌ను ఎంచుకున్నారని సమాచారం. ఇంకా మూడో నాయిక పాత్ర కూడా ఉంది. ఇది పక్కన పెడితే… నభా ‘అంధాదున్‌’ రీమేక్‌లో నటిస్తోంది. ఆ సినిమా ఫలితం కూడా ఆమెకు కీలకం.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus