‘ప్రభాస్ రాజా సాబ్’ సినిమా ఫలితం, తొలి రోజు వసూళ్ల సంగతి పక్కన పెట్టి ఆ సినిమాలోని ఓ పాట విషయంలో జరుగుతున్న పంచాయితీ గురించి చూద్దాం. ఫలితం, వసూళ్ల సంగతి మీకు తెలుసు కాబట్టే ఆ లెక్కలు ఇప్పుడు ప్రస్తావించడం లేదు. ఈ సినిమాలో ముగ్గురు భామలతో ‘నాచే నాచే..’ అనే ర్యాప్ సాంగ్‌లో సందడి చేశాడు ప్రభాస్. ఈ పాటపై కాపీ విమర్శలు వస్తున్నాయి. బాలీవుడ్ బ్లాక్ సినిమా ‘డిస్కో డ్యాన్సర్’లోని ఓ పాటకు రీమిక్స్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
అయితే తన పాట నుండి కాపీ కొట్టారని స్వీడన్‌కు చెందిన ప్రముఖ డీజే ప్రొడ్యూసర్ విడోజిన్ అంటున్నాడు. 2024లో తాను చేసిన సాంగ్‌ని ‘నాచే నాచే..’ పాట పోలి ఉందని ఆయన అంటున్నారు. అంతేకాదు ‘ఈ పాట కానీ కాదని మీరు అనుకుంటున్నారా’ అంటూ తన చెప్పు చూపించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇది కాపీనేనని కామెంట్స్ చేస్తూ కొంతమంది ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్‌ను ఎప్పటిలా ట్రోల్ చేస్తున్నారు.
మరికొందరు రెండు పాటలు దగ్గర దగ్గరగా ఉన్నాయని.. దానికే విడోజిన్ అలా రియాక్ట్ అవ్వడం సరికాదు అని విమర్శలు చేస్తున్నారు. మరి ఈ విషయంలో తమన్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. ఎందుకంటే ఇలాంటి కాపీ మరకల విషయంలో ఆయన పెద్దగా పట్టించుకోరు. అయితే వార్తలు వస్తున్నట్లు చెప్పు చూపించడం లాంటి పనులు మాత్రం సరికాదు అనే చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో మ్యూజిక్ రిలేషన్ ఎక్కువగా కనిపిస్తోంది.
ఇప్పుడు సినిమాల సంగతికి వస్తే.. మొదటిరోజు రూ.112 కోట్లు వసూళ్లు వచ్చినట్లు నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. సినిమాను కుటుంబసమేతంగా చూస్తుండటం ఆనందంగా ఉందన్నారాయన. ఇక ప్రభాస్ అభిమానులను ఉత్సాహపరిచేందుకు ఎనిమిది నిమిషాల సన్నివేశాలను యాడ్ చేస్తున్నామని దర్శకుడు మారుతి తెలిపారు. ప్రభాస్ ఓల్డ్ గెటప్ ఎపిసోడ్ అందులో ఉంటుందన్నారు..
