Prabhas: ప్రభాస్ ‘ప్రాజెక్ట్ – కె’ గురించి సంచలన విషయాలు బయట పెట్టిన డైరెక్టర్ నాగ్ అశ్విన్..

టాలీవుడ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా అండ్ గ్లోబల్ స్టార్ ప్రభాస్, ‘మహానటి’ తో ప్రేక్షకుల మనసులు దోచుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో.. సైన్స్ ఫిక్షన్ బ్యాక్‌డ్రాప్‌ల్.. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు రాని సరికొత్త సూపర్ హీరో తరహా కథ, కథనాలతో తెరకెక్కుతున్న క్రేజీ అండ్ ప్రెస్టీజియస్ ఫిల్మ్.. ‘ప్రాజెక్ట్ -K’.. దీపికా పదుకోన్, లెజెండరీ యాక్టర్ అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు.

దర్శక దిగ్గజం సింగీతం శ్రీనివాస రావు స్క్రిప్ట్ మెంటార్‌గా వర్క్ చేస్తున్నారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్రగామి నిర్మాణ సంస్థగా పేరుగాంచిన వైజయంతి మూవీస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని అత్యంత భారీస్థాయిలో, ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించబోతున్నారు.. అమితాబ్, ప్రభాస్ పుట్టినరోజులకు శుభాకాంక్షలు చెబుతూ.. వేలు మాత్రం కనిపిస్తున్న పోస్టర్స్ రిలీజ్ చేయడం తప్ప ఇంకెలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు టీం.. ఫస్ట్ లుక్, టైటిల్ లాంటివి రివీల్ చేయాలని ఫ్యాన్స్,

మూవీ లవర్స్‌తో పాటు ఆడియన్స్ కూడా సోషల్ మీడియా ద్వారా నాగ్ అశ్విన్‌ని అడుగుతున్నారు. ఇప్పటివరకు కాస్త మౌనంగా ఉన్న డైరెక్టర్.. ఈ విషయంలో ఇప్పుడు కాస్త క్లారిటీ ఇచ్చారు.‘‘ప్రాజెక్ట్ -K’ అనేది కంప్లీట్ న్యూ ఫిల్మ్.. స్క్రిప్ట్ కొత్తది.. దీన్ని బిల్డప్ చేసే వరల్డ్ టెక్నీషియన్స్ కూడా కొత్తవాళ్లు.. ఒకరకంగా ఈ సినిమాని ఎలా చేయాలో అనేదానికి చాలా టైం పడుతుంది. ఫస్ట్ నుండి ప్రతీది పక్కాగా, కొత్తగా క్రియేట్ చేయాలి.. ఉదాహరణకి.. ‘మహానటి’ లో కార్లు కావాలంటే రెంట్‌కి తీసుకొచ్చే వాళ్లం.

అదే ఈ సినిమాకి వెహికల్స్ కావాలంటే మాత్రం లేవు.. మనమే తయారు చేసుకోవాలి.. టైం పడుతుంది అలాగే ‘ప్రాజెక్ట్ -K’ సినిమా కచ్చితంగా కొత్తగా ఉంటుంది’’ అని చెప్పుకొచ్చారు. నాగ్ అశ్విన్ ‘మహానటి’ లాంటి భారీ సినిమాని.. పైగా సావిత్రి గారి లాంటి లెజెండరీ పర్సన్ బయోపిక్‌ని అంత బాగా హ్యాండిల్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు.. తెరమీద ఆనాటి వాతావరణాన్ని చాలా బాగా చూపించారు. ఈ ‘ప్రాజెక్ట్ -K’ తో ఆడియన్స్‌ని ఓ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus