సరికొత్త కాంబినేషన్ లో అల్లు అర్జున్ చిత్రం

అల్లు అర్జున్ హీరోగా తన స్థాయిని పెంచుకుంటూనే వరుస సినిమాలు చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తున్నాడు. ‘సరైనోడు’ తర్వాత వచ్చిన గాప్ ని దాటేందుకు వరుసగా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బన్నీ ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుసామి తెరకెక్కించనున్న సినిమాని సెట్స్ మీదికి తీసుకెళ్లనున్న ఈ అల్లువారి హీరో ఈ సినిమా కోసం దక్షిణాదిలో అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన స్టూడియో గ్రీన్ వారితో చేతులు కలిపిన సంగతి తెలిసిందే. దీని తర్వాత కుటుంబ సంస్థలోనే మరో చిత్రం చేయనున్నాడు అల్లు అర్జున్.

కుటుంబ సంస్థ అంటే ‘గీతా ఆర్ట్స్’ అనుకునేరు. ఇప్పుడు మీ కుటుంబంలో నాలుగు నిర్మాణ సంస్థలు ఉన్నాయి. గీత ఆర్ట్స్ బ్యానర్ ముందు నుండి ఉన్నదే. తర్వాత నాగబాబు గారు అంజనా ప్రొడక్షన్స్ పేరిట సొంత బ్యానర్ ఏర్పాటు చేశారు. ఈ మధ్యకాలంలో పవన్ తన పేరిట ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ సంస్థ నెలకొల్పగా చెర్రీ ఇంటిపేరుతో ‘కొణిదెల ప్రొడక్షన్స్’ అని సొంత కుంపటి పెట్టాడు. ఇంతకీ బన్నీ ఏ సంస్థలో సినిమా చేయనున్నాడు అంటారా..? అక్కడికే వస్తున్నా. ‘ఆరెంజ్’ సినిమా తర్వాత నిర్మాణ రంగానికి దూరమైన నాగబాబు బ్యానర్ లోనే. ఈ సినిమాకి శ్రీధర్ లగడపాటి సహ నిర్మాతగా వ్యవహరించనున్నట్టు సమాచారం. ఎన్టీఆర్ నమ్మి ఏళ్లకు ఏళ్ళు ఎదురుచూసిన కథా రచయిత వక్కంతం వంశీ ఈ సినిమాతో దర్శకుడిగా మారుతుండటం వీటన్నిటిని మించిన విషయం. ఈ సరికొత్త కాంబినేషన్లో రానున్న సినిమా మార్చ్ లో పట్టాలెక్కున్నట్టు పరిశ్రమవర్గాల కథనం.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Share.