నాగబాబు ఓ ట్వీట్ వేశారంటే అంతా అలర్ట్ అయిపోతారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ మెంబర్స్ మనసులో ఉన్న మాటలను ఆయన బయటపెడతారని, మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి మాట్లాడే మనస్తత్వం ఆయనది కాదని.. అంతా అనుకుంటారు. అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయిన శిల్పా రవిని సపోర్ట్ చేయడాన్ని.. వ్యతిరేకించారు నాగబాబు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఆయన్ని ట్రోల్ చేశారు. కానీ ఆ కోపం నాగబాబుది మాత్రమే కాదు ప్రతి మెగా ఫ్యామిలీ మెంబర్ కూడా ఆయనలానే ఫీల్ అయ్యారు అని తర్వాత ‘పుష్ప 2’ ట్రైలర్ తో అందరికీ ఓ క్లారిటీ వచ్చింది.
ఎందుకంటే ‘పుష్ప 2’ ట్రైలర్ గురించి మెగా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరూ స్పందించింది లేదు. ఇదిలా ఉంటే.. రేపు అనగా డిసెంబర్ 5న ‘పుష్ప 2’ రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలో నాగబాబు ఓ ట్వీట్ వేసి హాట్ టాపిక్ అయ్యారు. కాకపోతే ఈసారి ఆయన నెగిటివ్ గా కాదు పాజిటివ్ గా ట్వీట్ వేశారు.
నాగబాబు తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ.. “24 క్రాఫ్ట్ ల కష్టంతో,
వందల మంది టెక్నీషియన్ల శ్రమతో
వేల మందికి ఉపాధి కలిగించి,
కోట్ల మందిని అలరించేదే *సినిమా*
ప్రతి సినిమా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం…
అందరిని అలరించే సినిమాని సినిమాలనే ఆదరించాలని, ప్రతి మెగా అభిమానిని మరియు ప్రతి సినీ అభిమానిని కోరుకుంటున్నాను…” అంటూ పేర్కొన్నాడు.
నాగబాబు చేసిన ఈ కామెంట్స్.. ‘పుష్ప 2’ గురించే అని అంతా అనుకుంటున్నారు. అల్లు అర్జున్ పై ఉన్న కోపాన్ని.. ‘పుష్ప 2’ సినిమాపై చూపించొద్దు అని, ఆ సినిమాకి ఎంతో మంది కష్టపడి పని చేశారు, నిర్మాతలు కూడా ఎంతో ఖర్చు పెట్టి తీసారని, సినిమా వల్ల ఎంతో మందికి ఉపాధి కలుగుతుందని.. ఈ సందర్భంగా నాగబాబు పరోక్షంగా ‘పుష్ప 2’ గురించి మేకర్స్ పడ్డ కష్టాన్ని గుర్తు చేసినట్లు అయ్యింది.