Naga Chaitanya, Akhil: నాగ చైతన్య, అఖిల్..ల పెళ్లిళ్ల విషయంలో నాగ్ డెసిషన్ అదేనా..?
- November 26, 2024 / 07:55 PM ISTByFilmy Focus
అక్కినేని అఖిల్ (Akhil Akkineni) ఈరోజు టాక్ ఆఫ్ ది డే అయ్యాడు. ఎందుకో ఈపాటికే అందరికీ తెలిసే ఉంటుంది. చాలా సైలెంట్ గా జైనాబ్ రవ్ డ్జీ అనే అమ్మాయితో అఖిల్ నిశ్చితార్థం ఈరోజు జరిగింది. ఈ విషయం మీడియాకి తెలియకుండా అక్కినేని ఫ్యామిలీ చాలా జాగ్రత్తలు తీసుకుంది. నాగార్జున (Nagarjuna) ట్విట్టర్లో ఫోటోలు షేర్ చేసే వరకు అఖిల్ ఎంగేజ్మెంట్ గురించి ఎవ్వరికీ తెలీదు. ‘జైనాబ్‌ని అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది.
Naga Chaitanya, Akhil

కొత్త జంట మీరు ప్రేమ, ఆశీర్వాదం కావాలి. జీవితాంతం వాళ్ళు కలిసి ఆనందంగా ఉండేలా ఆశీర్వదించడండి’ అంటూ నాగార్జున కోరారు. కానీ అఖిల్- జైనాబ్ రవ్ డ్జీ..ల పెళ్లి ఎప్పుడు? అనే విషయాన్ని రివీల్ చేయలేదు. అయితే మరోపక్క నాగ చైతన్య (Naga Chaitanya) ఎంగేజ్మెంట్ కూడా ఇటీవల శోభిత ధూళిపాళ తో (Sobhita Dhulipala) సింపుల్ గా జరిగింది. సో ఈ అన్నదమ్ముల పెళ్లిళ్లు ఒకే రోజు జరగబోతుంది అంటూ సోషల్ మీడియాలో కథనాలు పుట్టుకొస్తున్నాయి.

ఒకే టైంలో ఈ అక్కినేని హీరోలు పెళ్ళికి రెడీ అవ్వడంతో.. ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తున్నాయి అని స్పష్టమవుతుంది. నాగ చైతన్య- శోభిత..ల పెళ్లి, డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోస్లో దివంగత అక్కినేని నాగేశ్వరరావు (Akkineni Nageswara Rao) విగ్రహం వద్ద చాలా సింపుల్ గా జరగబోతుంది.

శోభిత బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వ్యక్తి. కాబట్టి వారి పద్ధతిలో పెళ్లి చేయాల్సిందిగా శోభిత తల్లిదండ్రులు నాగార్జున కుటుంబాన్ని కోరారట. సో వాళ్ళ పెళ్లి అలా జరగబోతుంది. కానీ అఖిల్ పెళ్ళికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. 2025 ఆరంభంలో ముహూర్తాలు ఉన్నాయి. సో సమ్మర్లో అఖిల్ పెళ్లి జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

















