నాగచైతన్య, సమంత పెళ్లి డేట్ ఫిక్స్
- April 19, 2017 / 06:43 AM ISTByFilmy Focus
అఖిల్ పెళ్లి వాయిదా పడగానే అక్కినేని అభిమానులు నిరుత్సాహ పడ్డారు. వారిని ఉత్సాహం కలిగించే వార్త ఒకటి బయటికి వచ్చింది. కింగ్ నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, సమంత పెళ్లిని జరిపించేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ ప్రేమ పక్షులు పెద్దల సమక్షంలో జనవరి 29న నిశ్చితార్థం చేసుకున్నారు. పెళ్లి పీటలపై కూర్చునేందుకు వారిద్దరూ కొంత గడువు కోరడంతో అప్పుడు ముహూర్తం ఫిక్స్ చేయలేదు. తాజాగా చైతూ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కల్యాణ వేడుకకు పనులు మొదలెట్టారు. అక్టోబర్ లో సమంత, నాగచైతన్య భార్య భర్తలు కానున్నట్లు సమాచారం అందింది. ఈ వివాహాన్ని హైదరాబాద్ లోని ఓ ఫంక్షన్ హాల్లో నిర్వహించనున్నట్లు తెలిసింది. అయితే డేట్ ని మాత్రం ఇప్పుడే బయటికి చెప్పడానికి అక్కినేని కుటుంబ సభ్యులు నిరాకరించారు.
పెళ్లి పత్రికలు పంచిన తర్వాత ఆ డేట్ తెలియనుంది. మొదట హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం జరిపించనున్నారు. అనంతరం చర్చిలో మరో మారు జీసస్ ఎదుట ఉంగరాలు మార్చుకోనున్నారు. ప్రస్తుతం నాగచైతన్య కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో “వేడుక చూద్దాం రారండోయ్” మూవీ చేస్తున్నారు. మరో థ్రిల్లర్ మూవీ కూడా చేస్తున్నారు. సమంత రామ్ చరణ్ సరసన నటిస్తోంది. వీరిద్దరూ ఈ ప్రాజక్ట్ లన్నీ అక్టోబర్ నాటికీ కంప్లీట్ చేయనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

















