Naga Chaitanya, Sobhita Dhulipala: నాగ చైతన్య – శోభితా ధూళిపాళ్ల నిశ్చితార్థం వార్తల్లో నిజమెంత?
- August 8, 2024 / 11:02 AM ISTByFilmy Focus
అక్కినేని నాగ చైతన్య (Naga Chaitanya) , హీరోయిన్ శోభితా ధూళిపాళ్ల (Sobhita Dhulipala) .. డేటింగ్లో ఉన్నారంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాలపై పలుమార్లు వాళ్లకి సూటిగా ప్రశ్నలు ఎదురైనప్పటికీ.. వాళ్ళు స్ట్రైట్ గా ‘ఎస్’ అని కానీ ‘నో’ అని కానీ… చెప్పకపోవడం వల్ల ఈ వార్తలు కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. గతంలో వీళ్ళిద్దరూ పలుమార్లు కలుసుకున్న ఫోటోలు కూడా ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం వల్ల… వీరి డేటింగ్ వార్తలకు మరింత బలం చేకూరినట్లు అయ్యింది.
Naga Chaitanya, Sobhita Dhulipala

అంతేకాదు నాగ చైతన్య ఎప్పుడైనా విదేశాలకి వెకేషన్ నిమిత్తం వెళితే.. అదే ప్లేస్ నుండి శోభితా కూడా ఫోటోలు తీసుకుని పోస్ట్ చేస్తుంది అంటూ సోషల్ మీడియా సైంటిస్ట్..లు మీమ్స్ రూపంలో ఆ టాపిక్ ని వైరల్ చేస్తున్న సందర్భాలు కూడా మనం చాలానే చూశాం. సరే ఈ విషయాలు పక్కన పెట్టేస్తే.. సడన్ గా కొన్ని గంటల నుండి నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల ఈరోజు అనగా ఆగస్టు 8న ఎంగేజ్మెంట్ చేసుకోబోతున్నట్లు ప్రచారం మొదలైంది.

ఇది రూమరా లేక నిజమేనా? అనేది క్లారిటీ లేక అక్కినేని అభిమానులు అయోమయానికి గురవుతున్నారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం అయితే.. ‘అది నిజమే’ అని చెబుతున్నారు. నాగార్జున ఇంట్లో నాగ చైతన్య- శోభిత ధూళిపాళ్ల…ల ఎంగేజ్మెంట్ నిరాడంభరంగా జరగబోతుంది అని, నాగార్జున (Nagarjuna) ఈ విషయాన్ని అధికారికంగా.. ఆ వేడుకకు సంబంధించిన ఫోటోలు షేర్ చేసి మరీ వెల్లడిస్తారని అంటున్నారు.













