Naga Chaitanya: సమంతతో విడాకులు.. ఇప్పుడు మరో హీరోయిన్ తో ఎఫైర్..?

టాలీవుడ్ లో హీరోగా తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నాగచైతన్య. తన సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈ హీరో త్వరలోనే ‘థాంక్యూ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పుడు చైతుకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. నాగచైతన్య ఓ హీరోయిన్ ను డేట్ చేస్తున్నారట. ఇంతకీ ఆమె ఎవరంటే.. శోభితా ధూళిపాళ్ల. స్టార్ హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు చైతు.

వీరిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవారు. చాలా మంది ఇన్స్పిరేషన్ గా కూడా నిలిచారు. అలాంటిది ఇద్దరూ విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చారు. ఇప్పటికే ఈ జంట విడాకులు తీసుకొని ఎవరి దారి వారు చూసుకున్నారు. భర్తతో విడిపోయిన తరువాత సమంత కెరీర్ లో చాలా బిజీ అయింది. వరుస సినిమాలు ఒప్పుకుంటుంది. అయితే లైఫ్ లో మాత్రం ఇంకా సింగిల్ గానే ఉంది. తన సెపరేషన్ నుంచి బయటపడడానికి సమంతకి ఇంకాస్త సమయం పట్టేలా ఉంది.

అయితే చైతు మాత్రం అప్పుడే డేటింగ్ మొదలుపెట్టినట్లు వార్తలొస్తున్నాయి. నటి శోభితా ధూళిపాళ్లతో చైతు డేటింగ్ చేస్తున్నాడట. బాలీవుడ్ లో సినిమాలు, వెబ్ సిరీస్ లు చేసిన ఈ బ్యూటీ తెలుగులో ‘గూఢచారి’, ‘మేజర్’ వంటి సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఆమెకి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి.

ఇప్పుడు ఆమెకి మరిన్ని అవకాశాలు వస్తున్నాయి. అయితే అక్కినేని ఫ్యామిలీ హీరోతో ఆమె ఎఫైట్ నడిపిస్తుందనే వార్త బాలీవుడ్ లో జోరుగా సర్క్యులేట్ అవుతుంది. మరి ఈ రూమర్స్ పై అటు చైతు కానీ ఇటు శోభితా కానీ స్పందిస్తుందేమో చూడాలి!

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus