Naga Chaitanya, Samantha: సామ్ – చైతూ.. ఆఖరి ఫొటో డిలీట్!
- October 28, 2024 / 05:00 PM ISTByFilmy Focus
టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య (Naga Chaitanya) త్వరలో హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను (Sobhita Dhulipala) వివాహం చేసుకోనున్న విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం నాగార్జున (Nagarjuna) ఇంట్లో వీరి నిశ్చితార్ధం జరిగింది. ఇటీవల శోభిత పసుపు వేడుక ఫొటోలు షేర్ చేయడంతో వివాహం సమీపించిందనే సంకేతాలు ఇస్తోంది. డిసెంబర్‌లో వీరి వివాహ వేడుక జరగనుందని టాక్ ఉంది, ఇప్పటికే ఇరువురి కుటుంబాలు ఈ ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. ఇదిలా ఉండగా, చైతూ తన మాజీ భార్య సమంతతో (Samantha) దిగిన చివరి ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ నుంచి తొలగించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
Naga Chaitanya, Samantha

2017లో ప్రేమ వివాహం చేసుకున్న చైతూ-సామ్ 2021లో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. వి డాకుల అనంతరం తమ కలిసి దిగిన చిత్రాలను చాలావరకు డిలీట్ చేశారు. కానీ, ఒక రేస్ ట్రాక్ ఫొటోలో ఇద్దరూ కారులో కలిసి ఉన్న పిక్ మాత్రం మొన్నటి వరకు ఉండేది. “మిసెస్ అండ్ ది గర్ల్‌ఫ్రెండ్” అనే క్యాప్షన్‌తో ఉన్న ఆ పోస్ట్‌పై నెటిజన్లు కూడా కొన్ని నెలలుగా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ, అది డిలీట్ చేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో, చైతూ ఆ ఫొటోను ఎట్టకేలకు తొలగించారు. సమంతతో విడాకుల తర్వాత చైతూ-శోభిత మధ్య ప్రేమ వార్తలు బాగా పాపులర్ అయ్యాయి. అనేక సందర్భాల్లో వీరిద్దరూ కలిసి కనిపించారు, కానీ తాము స్నేహితులమని చెప్పుకొచ్చారు. ఆగస్టులో నాగార్జున చైతూ-శోభిత ఎంగేజ్మెంట్ ఫొటోలు పోస్ట్ చేసి, పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం, సినిమాల విషయానికి వస్తే, నాగచైతన్య తన తాజా ప్రాజెక్ట్ ‘తండేల్’తో బిజీగా ఉన్నారు.

ఈ సినిమా ఉత్తరాంధ్ర మత్స్యకారుల జీవితాల ఆధారంగా చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సాయిపల్లవి (Sai Pallavi) ఇందులో కథానాయికగా నటిస్తున్నారు, ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదలకు సిద్దమవుతోంది. మరోవైపు, శోభిత నటించిన బాలీవుడ్ మూవీ ‘లవ్ సితార’ ఇటీవల ఓటీటీలో విడుదలై అందరినీ ఆకట్టుకుంటోంది.
















