అనారోగ్యంతో ఉన్న సమంతకు అక్కినేని కుటుంబం దగ్గరవుతోందా!

స్టార్ హీరోయిన్‌ సమంత తీవ్ర అనారోగ్యం పాలైన విషయం తెలిసిందే. ఆమె త్వరగా కోలుకోవాలి అంటూ టాలీవుడ్‌, కోలీవుడ్‌ సెలబ్రిటీలు ట్విటర్‌ ద్వారా తెలియజేస్తున్నారు. కొంతమంది నేరుగా ఆమెను కాంటాక్ట్‌ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆమె ఆరోగ్యం సహకరించడం లేదని, ఇప్పట్లో ఎవరినీ కలిసే అవకాశం లేదని చెబుతున్నారు. అయితే ఈ సమయంలో సమంతను నాగచైతన్య కలిశారు, ఆరోగ్యం గురించి వాకబు చేశారని వార్త ఒకటి టాలీవుడ్‌ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. దీనిపై సోషల్‌ మీడియాలో ఓ రకమైన చర్చ నడుస్తోంది.

కొంతమంది అయితే ఏకంగా సమంతకు అక్కినేని కుటుంబం దగ్గరవుతోంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. తొలుత సమంత హెల్త్‌ అప్‌డేట్‌ పోస్ట్‌ కింద అఖిల్‌ కామెంట్‌ చేయడం ఒక కారణమైతే.. రెండోది నాగచైతన్య కలిశాడు అనే వార్త. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి అని న్యూట్రల్‌ అభిమానులు కోరుతున్నారు. అదే చైతన్య కలిశాడు అనే విషయంలో నిజమెంత అనేది తెలుసుకోవడం ఉత్తమం అంటున్నారు. ఈ నేపథ్యంలో సమంతను నాగచైతన్య కలిశాడా లేదా అనేది చూస్తే.. పుకార్ల ప్రకారం సమంతను నాగచైతన్య ఆసుపత్రిలో కలిశాడు అని పుకార్లు వచ్చాయి.

అయితే సమంత వైద్యం ఆసుపత్రిలో జరగడం లేదట. ఇంట్లోనే ప్రత్యేక ఏర్పాట్లు చేసి వైద్యం తీసుకుంటోందట. ఈ నేపథ్యంలో నాగచైతన్య వచ్చి కలిశాడు అనే విషయంలో నిజం లేదు అని చెబుతున్నారు. అయితే ఇంటికి వెళ్లి కలిశాడా.. అంటే దానికి కూడా నో అనే సమాధానమే వస్తోంది. ‘యశోద’ డబ్బింగ్‌ను సమంత ఇంట్లో ఉండే చెప్పింది. తన అనారోగ్యం అప్డేట్‌ ఇచ్చినప్పుడు కూడా సమంత డబ్బింగ్‌ స్టూడియోలో లేదు. ఫొటోల్లో ఆమె ఇంట్లో సోఫా మీద కూర్చొని టీవీ చూస్తూ.. చెప్పింది.

దీనికి కారణం సమంత ఎవరినీ కలవాలని అనుకోవడం లేదట. ఎట్టి పరిస్థితుల్లో ఆరోగ్యం పూర్తిగా కుదుటపడ్డాకే బయటకు రావాలని అనుకుంటోందట. ఆమె అనారోగ్యానికి ముఖం చూపించడానికి ఏం సంబంధం లేదని అంటున్నా.. సమంత మాత్రం కలిసేది లేదు అంటోందట. ఆమె మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడి ప్రస్తుతం ట్రీట్‌మెంట్‌లో ఉన్నాను అని చెప్పిన విషయం తెలిసిందే.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus