‘గీత గోవిందం’ (Geetha Govindam) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు పరశురామ్ (Parasuram)(బుజ్జి).. నాగ చైతన్యతో ఓ సినిమా సెట్ చేసుకున్నాడు. కానీ మధ్యలో మహేష్ (Mahesh Babu) నుండి పిలుపు రావడంతో.. వెళ్లి ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata) చేశాడు. ఈ క్రమంలో నాగ చైతన్య (Naga Chaitanya) సినిమా నిర్మించాల్సిన నిర్మాతలు పరశురామ్ పై ఛాంబర్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే.. మహేష్ బాబు (Mahesh Babu) ‘సర్కారు వారి పాట’ లో వాళ్ళని కూడా పార్ట్నర్స్ ని చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేశాడు.
అయితే ‘సర్కారు వారి పాట’ కంప్లీట్ అయ్యాక కూడా పరశురామ్ చైతన్యతో సినిమా చేయలేదు. దీంతో చైతన్యకి కోపం వచ్చింది. ‘అతని గురించి మాట్లాడటం టైం వేస్ట్.. మీ టైం వేస్ట్.. నా టైం వేస్ట్’ అంటూ ఓపెన్ గానే బరస్ట్ అయ్యాడు. సో నాగ చైతన్య… పరశురామ్ ప్రాజెక్టుని రిజెక్ట్ చేసినట్టు క్లారిటీ కూడా ఇచ్చేశాడు. అయితే ఆ కథని అలాగే ఉంచేసి మరోపక్క పరశురామ్ బుజ్జి.. విజయ్ దేవరకొండతో (Vijay Devarakonda) ఫ్యామిలీ స్టార్ అనే సినిమా చేశాడు.
అది డిజాస్టర్ అయ్యింది. దాని తర్వాత పరశురామ్ కి ఏ హీరో కూడా ఛాన్స్ ఇవ్వలేదు. ఒకానొక టైంలో సూర్య, కార్తీ..లతో ఇతను మల్టీస్టారర్ చేస్తున్నట్టు ప్రచారం జరిగింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. తర్వాత అఖిల్ తో (Akhil Akkineni) సినిమా అన్నారు. అదీ రూమర్ గానే మిగిలిపోయింది. అయితే ఫైనల్ గా పరశురామ్ ఓ యంగ్ హీరోని ఒప్పించి సినిమా ఓకే చేయించుకున్నాడట. అతను మరెవరో కాదు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda).
టిల్లు స్క్వేర్ తో (Tillu Square) సిద్ధు ఇమేజ్ పెరిగింది. ప్రస్తుతం అతను బొమ్మరిల్లు భాస్కర్ (Bhaskar) దర్శకత్వంలో జాక్ చేస్తున్నాడు. అలాగే నీరజ కోన దర్శకత్వంలో కూడా ‘తెలుసు కదా’ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు పరశురామ్ కథకి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దిల్ రాజు (Dil Raju) ఈ ప్రాజెక్టుని నిర్మించే అవకాశాలు ఉన్నాయి.నాగ చైతన్య రిజెక్ట్ చేసిన కథతోనే సిద్ధుతో సినిమా చేయబోతున్నాడట పరశురామ్.