Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Naga Chaitanya: ‘థాంక్యూ’ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన నాగ చైతన్య..!

Naga Chaitanya: ‘థాంక్యూ’ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన నాగ చైతన్య..!

  • July 20, 2022 / 11:18 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Naga Chaitanya: ‘థాంక్యూ’ ప్రమోషన్లలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చిన నాగ చైతన్య..!

అక్కినేని నాగ చైత‌న్య హీరోగా దిల్‌రాజు నిర్మాణంలో రూపొందిన చిత్రం ‘థాంక్యూ’. ‘మనం’ తర్వాత విక్రమ్ కుమార్- నాగచైతన్య కాంబినేషన్ లో వస్తున్న మూవీ ఇది.టీజర్, ట్రైలర్ లు కూడా బాగున్నాయి. దీంతో జూలై 22న విడుదల కాబోతున్న సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ప్రమోషన్లో భాగంగా ఏర్పాటు చేసిన ఓ ఇంటర్వ్యూలో నాగ చైతన్య పాల్గొని కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చాడు.

ప్ర. ‘థాంక్యూ’ అనేది మీ కెరీర్ లో ఛాలెంజింగ్ రోల్ అనుకోవచ్చా?

నాగ చైతన్య : యెస్.. ‘థాంక్యూ’ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా చాలెంజింగ్‌ సినిమా. అందరికీ ఇందులో మూడు షేడ్స్ లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్ ఉంటాయి. 16 ఏళ్లు 20 ఏళ్లు, 2 5 ఏళ్లు, 30 ఏళ్లు, 36 ఏళ్లు ఇలా రకరకాల ఫేజెస్‌ చూపించాం. థాంక్యూ లాంటి స్క్రిప్ట్లు దొరకడం చాలా కష్టం. డైరక్టర్లు సింగిల్‌ లుక్‌ ఉన్న సినిమాలే ఎక్కువగా చెబుతుంటారు.

ఒకవేళ మార్పు ఉన్నా, ఫ్లాష్ బ్యాక్‌లో చిన్న మార్పు ఉంటుంది. అంతకు మించి చేంజెస్‌ ఉండవు.అలాంటిది 16 ఇయర్స్ నుంచి 36 ఏళ్ల వరకు త్రీ వేరియేషన్స్ లో కనిపించే స్క్రిప్ట్ రాగానే చాలెంజింగ్‌గా అనిపించింది. అందుకే టేకప్‌ చేశాను. ఇప్పుడంటే టీనేజర్‌గా జనాలు చూస్తారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్ టేకప్‌ చేశా.

ప్ర.’ప్రేమమ్’ కంటే కూడా ఇది ఛాలెంజింగ్ రోల్ అనుకోవచ్చా?

నాగ చైతన్య : ‘ప్రేమమ్‌’ లో నేను చేసింది… మనిషి జీవితంలో లవ్‌స్టోరీస్‌ వల్ల ఎలా ఇన్‌ఫ్లుయన్స్ అవుతాడు అనే కేరక్టర్‌. కానీ ఈ సినిమాలో ఒక వ్యక్తి జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు అనేది ఇంపార్టెంట్‌.సినిమా ఓపెనింగ్‌, ఎండింగ్‌ అంతా 70 పర్సెంట్‌ దాకా అబ్రాడ్‌లోనే చేశాం. కొంత భాగం రాజమండ్రి, వైజాగ్‌ పరిసరాల్లో చేశాం.ఓపెన్‌ ప్లేసెస్‌లో షూటింగ్‌ చేయడానికి నేనెప్పుడూ ఇష్టపడతాను.

అక్కడ షూటింగులు చేస్తున్నప్పుడు జనాలు కలుస్తారు. వాళ్ళ అభిప్రాయాలు చెబుతుంటారు. ఎలాంటి సినిమాలను ఇష్టపడుతుంటారో డిస్కషన్‌ చేసుకోవచ్చు.ఈ సినిమా కోసం చాలానే తగ్గాను. ఈ సినిమా కన్నా ముందే లాల్‌సింగ్‌ చద్దా కోసం 25 కిలోలు తగ్గాను. అది ఈ సినిమాకు చాలా బాగా హెల్ప్ అయింది.బ్యాక్‌ టు బ్యాక్‌ లవ్‌స్టోరీ, థాంక్యూ, ధూత అన్నీ చేసేశా. ఇవన్నీ కోవిడ్‌ ముందే చేయాల్సింది. కానీ కోవిడ్‌ వల్ల కుదరలేదు. కోవిడ్‌ టైమ్‌లోనే లాల్‌సింగ్‌ చద్దా ఆఫర్‌ వచ్చింది.

ప్ర. ఆమిర్ ఖాన్ నుండి మీకు కొత్తగా నేర్పించింది ఏంటి?

నాగ చైతన్య : ఆమిర్‌ చాలా మంచి టీచర్‌. ఆయన ఇలా చేయమని ఎప్పుడూ చెప్పరు. కానీ ఆయనతో మనం సమయం గడిపితే ఎలా చేస్తే బావుంటుందో అర్థమవుతుంది. చాలా నేర్చుకుంటాం.చిరంజీవిగారికి ప్రీమియర్‌ వేసినప్పుడు కూడా ఆమిర్‌ చాలా థ్రిల్‌ ఫీలయ్యారు. చిరంజీవి గారు మా సినిమాను సమర్పించడం చాలా ఆనందంగా ఉంది.

ప్ర. అభిరామ్ క్యారెక్టర్ తో ఎక్కువగా ట్రావెల్ అయ్యారా?

నాగ చైతన్య : అవును..! అంతేకాకుండా ‘థాంక్యూ’ మూవీలో అభిరామ్‌ జర్నీ గురించి విక్రమ్‌, రవి, దిల్‌రాజుగారు వచ్చి చెప్పినప్పుడు నాకు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. విక్రమ్‌ సెన్సిబుల్‌ విషయాలను చాలా బాగా డీల్‌ చేస్తారు.

ప్ర.’జోష్’ తర్వాత దిల్ రాజు గారితో 12 ఏళ్ళ తర్వాత మూవీ చేశారు, అంత గ్యాప్ ఎందుకు వచ్చింది?

నాగ చైతన్య : దిల్‌రాజుగారితో 12 ఏళ్ల తర్వాత సినిమా చేశాను. ఇంతకు ముందు కూడా ఆయన కాంపౌండ్‌ నుంచి చాలా కథలు విన్నా. కానీ ఈ సినిమాతో కుదిరింది. థాంక్యూ సినిమాతో వ్యక్తిగా నేను కూడా చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలు సగమే బయటకు చెప్పేవాడిని. కానీ ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్‌ అయ్యాను. చాలా బాగా వాళ్లతో కలిసిపోతున్నాను.

ప్ర. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు? వాళ్ళతో నటించడం ఎలా అనిపించింది?

నాగ్ చైతన్య : ఈ సినిమాలో రాశీ ఖ‌న్నా రోల్ చాలా కీల‌కం. త‌న వ‌ల్లే హీరో ప్రయాణం మొద‌ల‌వుతుంది. అలాగే మాళ‌వికా నాయ‌ర్ పాత్ర కూడా బావుంటుంది. అవికా గోర్ పాత్ర హీరోయిన్‌లా కాకుండా సిస్ట‌ర్‌లా ఉంటుంది.

ప్ర. ఈ సినిమాలో మహేష్ బాబు రిఫరెన్స్ ఉంది. కథలో భాగంగానేనా?

నాగ చైతన్య : ‘థాంక్యూ’ మూవీ ఓ టైమ్ లైన్‌లో వెళుతుంటుంది. కాబ‌ట్టి ఆ ప‌ర్టికుల‌ర్ స‌మ‌యంలో తెలుగులో హిట్ సినిమాలేంట‌నే దాన్ని కూడా సినిమాలో చూపించాం. మ‌హేష్‌గారి ఒక్క‌డు, పోకిరి ఇలా డిఫ‌రెంట్ స్టేజెస్‌లో ఆయ‌న సినిమాల‌ను క‌వ‌ర్ చేసుకుంటూ వచ్చాం.

ప్ర. ఈ సినిమాలో 3 వేరియేషన్స్ లో కనిపించారు? అందువల్ల షూటింగ్ ఏమైనా డిలే అయ్యిందా?

నాగ చైతన్య : 16 ఏళ్ల కుర్రాడిగా క‌న‌ప‌డ‌టానికి నాకు ప్రొడ‌క్ష‌న్ వాళ్లు స‌పోర్ట్ చేసి మూడు నెల‌ల టైం ఇచ్చారు. ఆ స‌మ‌యంలో వ‌ర్క‌వుట్స్ చేయ‌టంతో పాటు బాడీ లాంగ్వేజ్ ప‌రంగా కొన్ని వర్క్ షాప్స్ కూడా చేశాను. నాకు అలాంటి ట్రాన్స‌ఫ‌ర‌మేష‌న్స్ అంటే చాలా ఇష్టం. ప్ర‌తి స్క్రిప్ట్‌లోనూ అది దొర‌క‌దు. ఈ సినిమాలో దొరికింది. చాలా ఎగ్జ‌యిట్ అయ్యే చేశాను. ఇప్పుడంటే నా శ‌రీరం కూడా స‌పోర్ట్ చేస్తుంది. మ‌రి ఫ్యూచ‌ర్‌లో కుదురుతుందో లేదో చూడాలి.

ప్ర. ‘లాల్ సింగ్ చద్దా’ తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు.అక్కడ మరిన్ని ప్రాజెక్టులు చేసే అవకాశం ఉందా?

నాగ చైతన్య :ముందు హిందీ ఆడియన్స్ నన్ను యాక్సెప్ట్ చేయాలి. అలా చేస్తే అప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను. ఇప్ప‌టికైతే బాలీవుడ్ సినిమాలేవీ ఒప్పుకోవ‌టం లేదు.

ప్ర.తమన్ మ్యూజిక్ ఈ సినిమాకి ఎంత వరకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారు?

నాగ చైతన్య : ఈ సినిమాలో సాంగ్స్ అన్నీ సిట్యువేష‌న్స్ ప‌రంగా వెళుతుంటాయి. ప్రేమ‌మ్‌, ఏమాయ చేసావె స్టైల్లో ఉంటాయి.

ప్ర. ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్ కు రావడం తగ్గించారు. దీనిని మీరు ఎంత వరకు పరిగణలోకి తీసుకున్నారు?

నాగ చైతన్య : సినిమాలో ఏదో కొత్త విష‌యం ఉన్న‌ప్పుడే ఆడియెన్స్ సినిమా థియేట‌ర్స్‌కు వ‌స్తున్నారు. ట్రైల‌ర్ చూసే సినిమాను చూడాలా వ‌ద్దా అని నిర్ణ‌యించుకుంటున్నారు. ఇప్పుడు సినిమాల ఎంపికలో నా మైండ్ సెట్ మారింది. సినిమాలో హీరో, డైరెక్ట‌ర్ అనే విష‌యాల‌ను ప‌క్క‌న పెడితే కంటెంట్ ఈజ్‌కింగ్ .

ప్ర. మీరు కథల ఎంపికలో ఎంపికలో ఏమైనా మార్పులు చేయాలనుకున్నారా?

నాగ చైతన్య : లేదు ఇందాక చెప్పినట్టు.. కంటెంట్ ను దృష్టిలో పెట్టుకునే కథల్ని ఎంపిక చేసుకుంటున్నాను. దూత‌లో హీరోయిన్ లేదు. క్యారెక్ట‌ర్ బేస్ చేసుకుని ర‌న్ అవుతుంది. నేను డైరెక్ట‌ర్స్‌ని బాగా న‌మ్ముతాను. డైరెక్ట‌ర్ ఎంత బాగా చెబితే అంత బాగా న‌టిస్తాను. ఆడియెన్స్ న‌న్ను ల‌వ్ స్టోరీస్‌, ఎమోష‌న‌ల్ జ‌ర్నీస్ సినిమాల‌తో ఎంక‌రేజ్ చేశారు. దాంతో క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్‌కు సూట్ అవుతానా అనే సందేహం ఉంటుంది. గ‌తంలో యాక్ష‌న్ ట్రై చేస్తే వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ బంగార్రాజు చేశాను. అందులో నా క్యారెక్ట‌ర్ హై ఎన‌ర్జిటిక్‌గా ఉంటుంది. నాన్న ప‌క్క‌న చేయ‌టం అనేది చిన్న భ‌యం ఉంటుంది.

ప్ర.అఖిల్ కొత్త మూవీ ఫస్ట్ లుక్ చూశారా?

నాగ చైతన్య : ‘ఏజెంట్’ ట్రైల‌ర్ చూశాను. బాగుంది. అఖిల్ త‌న లుక్ మార్చుకోవ‌టం కోసం ఎంత క‌ష్ట‌ప‌డ్డాడో నాకు తెలుసు. ఏజెంట్‌తో త‌న‌కు మాస్‌, క‌మర్షియ‌ల్‌గా పెద్ద స‌క్సెస్ వ‌స్తుంద‌ని అనుకుంటున్నాను.

ప్ర. వెంకట్ ప్రభు దర్శకత్వంలో బై లింగ్యువల్ మూవీ చేస్తున్నారు? ఎలా ఉండబోతుంది?

నాగ చైతన్య : వెంక‌ట్ ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో నేను చేస్తోన్న మూవీలో నాది పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌. నా స్టైల్లో సాగే మాస్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ అది. సెన్సిబుల్ ఇంటెలిజెంట్ మూవీ.మానాడు సినిమా చూడ‌గానే నాకు బాగా న‌చ్చేసింది. ఆ రైట్స్ అమ్మ‌లేమ‌నో ఏదో ఇష్యూస్ ఉంటాయ‌నడంతో వ‌దిలేశాను. మానాడు ముందు నుంచే వెంక‌ట్ ప్ర‌భుతో ట్రావెల్ అవుతున్నాను. ఇప్పుడు త‌న‌తో చేస్తున్న సినిమా మానాడు కంటే ముందుగానే చెప్పాడు. మానాడు రైట్స్ కోసం ట్రై చేశాను. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. ఇప్పుడు రానా తీసుకున్నాడు.

ప్ర. మీ నెక్స్ట్ ప్రాజెక్టులు ఏంటి?

నాగ చైతన్య : త‌రుణ్ భాస్క‌ర్ ఓ మంచి పాయింట్ చెప్పాడు. అది డిస్క‌ష‌న్‌లో ఉంది.

ప్ర.పరశురామ్ గారితో మూవీ ఉంటుంది అని విన్నాం..!

నాగ చైతన్య : పరుశురామ్ గారి సినిమా స్టోరీ ఇంకా లాక్ కాలేదు. ఓ పాయింట్ అనుకున్నాం.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Raashi khanna
  • #Thank You
  • #Vikram K Kumar

Also Read

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

IMDB Top Movies List: ఐఎండీబీ టాప్‌ లిస్ట్‌ వచ్చేసింది… ఏ సంవత్సరం ఏ సినిమా టాప్‌లో ఉందంటే?

related news

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

Telusu Kada: ‘తెలుసు కదా’ కి అప్పుడే రూ.22 కోట్ల డీల్..!

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Love Story Collections: 4 ఏళ్ళ ‘లవ్ స్టోరీ’.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

trending news

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

Sujeeth: ‘ఓజీ’ కోసం మరోసారి ఎడిట్‌ టేబుల్‌ దగ్గరకు సుజీత్‌.. నిజమేనా?

41 mins ago
Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

49 mins ago
Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

Rukmini Vasanth: హమ్మయ్య.. రుక్మిణీ వసంత్ కి ఒక హిట్టు పడింది..!

2 hours ago
Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

Anushka: అప్పుడు ఎంజాయ్‌ చేయలేకపోయా.. ఇప్పుడు ఫుల్‌ రెడీగా ఉన్నా: అనుష్క

3 hours ago
Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

Allu Sirish Fiance Naynika: శిరీష్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ తెలుసా?

3 hours ago

latest news

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

27 mins ago
Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

Nani: నాని సినిమా నిర్మాతలు ఇలా మారిపోతున్నారేంటి? సమస్య ఎక్కడుంది?

45 mins ago
Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

Rahul Ramakrishna: అప్పుడు కవర్‌ చేశాడు.. ఇప్పుడు ఆ పని చేయలేక ఏకంగా అకౌంట్‌ డీయాక్టివేట్‌!

2 hours ago
Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

2 hours ago
Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

Rishab Shetty: ఆ రోజు ఒక్క షోకి కష్టపడి.. ఇప్పుడు ఏకంగా 5000 స్క్రీన్లలో సినిమా!

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version