Naga Shaurya, Anusha Shetty: నాగశౌర్యకు కోట్లు విలువ చేసే ఆస్తులను కట్నంగా ఇచ్చిన మామ?

టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య ఎట్టకేలకు తాను ప్రేమించిన అమ్మాయి అనూష శెట్టితో ఏడడుగులు నడిచి బెంగళూరు అల్లుడుగా మారిపోయారు. ఈయన బెంగళూరుకు చెందిన ప్రముఖం ఇంటీరియర్ డిజైనర్ అనూష శెట్టితో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారడంతో పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. నాగశౌర్య అనూష శెట్టిని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ ఈ విషయం ఎక్కడా తెలియకుండా చాలా సీక్రెట్ గా తన ప్రేమ వ్యవహారాన్ని నడిపారు. ఇలా ప్రేమలో ఉన్నటువంటి నాగశౌర్య అనూష శెట్టి ఒక్కసారిగా వీరి పెళ్లి విషయాన్ని తెలియజేస్తూ అందరికీ షాక్ ఇచ్చారు.

ఇక నవంబర్ 20వ తేదీ వీరి వివాహం బెంగుళూరులోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం నాగశౌర్య దంపతులు హైదరాబాదులోని పలు పూజా కార్యక్రమాలలో పాల్గొంటూ బిజీగా ఉన్నారు. ఇక నాగశౌర్య వివాహం చేసుకోబోతున్నారని తెలియగానే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరు తన బ్యాగ్రౌండ్ ఏంటి అనే విషయం గురించి పెద్ద ఎత్తున ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే అనూష శెట్టి కూడా ప్రముఖ వ్యాపారవేత్త కుమార్తె అని తెలుస్తోంది.

ఇక వీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పటికీ అనూష శెట్టి తండ్రి ఈమెకు భారీగానే వారి హోదాకు తగ్గట్టుగా కట్న కానుకలు సమర్పించారని సమాచారం.నాగశౌర్య కోసం తన మామగారు ఏకంగా 50 కోట్ల విలువచేసే ఆస్తులను కట్నంగా ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా నాగశౌర్య కట్నం గురించి ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయితే మరి కొందరు నాగశౌర్య ప్రేమ వివాహం చేసుకోవడంతో ఎలాంటి కట్న కానుకలు తీసుకొలేదని తెలుస్తుంది. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజమందో తెలియాలంటే ఈ వార్తలు పై నాగశౌర్య లేదా ఆయన సన్నిహితులు స్పందించాల్సి ఉంది.

1






2

3

4




More..

1

2




3

4




5

6

7

8

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus