ఆశలన్నీ ఆ సినిమా పైనే.. ఏమవుతుందో ఏమో!

దాదాపు నెల రోజుల నుండి బాక్సాఫీస్ వద్ద సరైన హిట్టు లేదు. జనాలు థియేటర్లను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పల్లెటూర్లలో అయితే కొన్ని థియేటర్లు మెయింటెనెన్స్ ఛార్జీలు కూడా రాకపోవడం వల్ల మూసేశారు. గ‌త వారం అయితే… బాక్సాఫీస్ చాలా డల్ అయిపోయింది. మార్చిలో ప‌రీక్ష‌ల హ‌డావుడి ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి నుండి ప్రేపరేషన్లు వంటివి మొదలుపెడతారు విద్యార్థులు. అందుకే మేకర్స్ కూడా తమ సినిమాలను ఈ సీజన్లో రిలీజ్ చేసి నష్టాలు ఫేస్ చేయాల్సి వస్తుందని..

సినిమాలను విడుదల చేయడానికి ధైర్యం చేయరు. అందుకే ఈ సీజన్లో చిన్న చితకా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. వాటికి ఇదే మంచి సమయం కాబట్టి. ‘సార్’ సినిమా బ్లాక్ బస్టర్ అయినా అది డబ్బింగ్ సినిమా. ఇక ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ‘బలగం’ వంటి సినిమాలు హిట్లు పడినా అవి వాటి రేంజ్లో క్యాష్ చేసుకుని సరిపెట్టుకున్నాయి కానీ జనాలు ఎగబడి అయితే థియేటర్లకు రాలేదు.

ఈ నేపథ్యంలో ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల పై అందరి దృష్టి పడింది. అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `ఫ‌లానా అబ్బాయి, ఫ‌లానా అమ్మాయి` సినిమా ఒకటి కాగా మరొకటి ఉపేంద్ర హీరోగా చేసిన `కబ్జ‌` సినిమా మరొకటి. ఇందులో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నుండి వస్తున్న సినిమా కాబట్టి ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా కొంత యూత్ అటెన్షన్ ను డ్రా చేసింది.

‘క‌బ్జ’ పై కూడా అంచనాలు ఉన్నాయి. కానీ అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందే సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది కాబట్టి.. `ఫ‌లానా అబ్బాయి, ఫ‌లానా అమ్మాయి` సినిమా పై జనాల ఫోకస్ ఉంది.

రెమ్యూనరేషన్ విషయంలో తగ్గేదే లే అంటున్న టాప్ 10 తెలుగు దర్శకులు!
విదేశాల్లో ఎక్కువగా కలెక్ట్ చేసిన 10 ఇండియన్ సినిమాలు!

2023 టాప్ 10 తెలుగు హీరోయిన్లు వాళ్ళ రెమ్యూనరేషన్స్.!
మనోజ్ టు అభిరామ్.. పెద్దోళ్ల సపోర్ట్ కు దూరంగా ఉన్న వారసుల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus