ఓటీటీల హవా పెరిగిన తర్వాత అన్ని భాషల్లోని ప్రేక్షకులు, అన్ని భాషల్లోని సినిమాలు వీక్షిస్తున్నారు. అందుకే సినిమా రేంజ్ పెరిగింది. దర్శకులు కూడా పాన్ ఇండియా ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని కథలు రాస్తున్నారు. కంటెంట్ కనుక బాగుంటే.. పక్క భాషల్లో కూడా తెలుగు సినిమాలు హిట్ అవుతున్నాయి. లేదు అంటే వేరే భాషల్లో డబ్బింగ్ రైట్స్, రీమేక్ రైట్స్ వంటి వాటి రూపంలో నిర్మాతలకు మంచి డబ్బులు వస్తున్నాయి. కొన్నాళ్లుగా చూసుకుంటే తెలుగు దర్శకులు కూడా పక్క భాషల్లోని హీరోలతో సినిమాలు చేస్తూ వస్తున్నారు.
వెంకీ అట్లూరి (Venky Atluri) ఆల్రెడీ ధనుష్ తో (Dhanush) ‘సార్’ (Sir), దుల్కర్ తో (Dulquer Salmaan) ‘లక్కీ భాస్కర్’ (Lucky Baskhar) వంటి సినిమాలు తీసి హిట్లు కొట్టాడు. వంశీ పైడిపల్లి (Vamshi Paidipally).. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో (Vijay Thalapathy) ‘వారసుడు'(Varisu) అనే సినిమా తీసి హిట్టు కొట్టాడు. అలాగే సూర్య (Suriya) వంటి హీరోలు కూడా తెలుగు దర్శకులతో సినిమాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ స్టార్ హీరో కూడా తెలుగులో స్ట్రైట్ మూవీ చేస్తున్నట్టు టాక్.
వివరాల్లోకి వెళితే.. ‘బ్రహ్మాస్త్రం’ (Brahmāstra) ‘యానిమల్’ (Animal) సినిమాలతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్ (Ranbir Kapoor) ఇప్పుడు తెలుగులో ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యాడట. ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్లో ఈ సినిమా రూపొందే అవకాశాలు ఉన్నాయి. దర్శకుడు ఎవరు? జోనర్ ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే ఈ సినిమా కోసం రణబీర్ కు ఆల్రెడీ రూ.15 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినట్లు సమాచారం.