Chiranjeevi: వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
- February 12, 2025 / 09:46 AM ISTByDheeraj Babu
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అనేది పేరు మాత్రమే కాదు, ఒక బ్రాండ్. 45 ఏళ్లకి మించిన సినీ ప్రస్థానం, 70 ల్లోకి అడుగిడుతున్న ప్రాయం, “ఇండస్ట్రీ పెద్ద” అనే గౌరవం.. అన్నీ కలగలిపి మెగాస్టార్ చిరంజీవిని కేరాఫ్ తెలుగు సినిమాగా నిలిపాయి. రీసెంట్ గా వెంకటేష్ (Venkatesh Daggubati) “సంక్రాంతికి వస్తున్నాం” (Sankranthiki Vasthunam) తో 300 కోట్ల క్లబ్ లోకి ప్రవేశించిన మొట్టమొదటి సీనియర్ హీరో అయ్యాడు కానీ.. అప్పటివరకు ఇండస్ట్రీ రికార్డులు, బాక్సాఫీస్ రికార్డులు అన్నీ చిరంజీవి పేరు మీదే ఉన్నాయని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
Chiranjeevi

అంతటి అత్యున్నత స్థానంలో ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈమధ్య అటెండ్ అయిన “లైలా (Laila) , బ్రహ్మానందం (Brahma Anandam)” ఈవెంట్స్ లో మాట్లాడిన మాటలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. లైలా ఈవెంట్లో విశ్వక్ సేన్ ను (Vishwak Sen) పట్టుకొని ప్రౌఢ అనడం, హీరోయిన్ షేక్ హ్యాండ్ ఇచ్చాక ఇక నీ పేరు మర్చిపోనులే అని మెలికలు తిరగడం వంటివి జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఆ విషయం నుండి తేరుకొనేలోపు నిన్న జరిగిన బ్రహ్మానందం ఈవెంట్లో లెజండరీ బ్రహ్మానందంను (Brahmanandam) ఉద్దేశించి మాట్లాడుతూ “ఎర్రి***” అనేసరికి అందరూ నివ్వెరపోయారు.
అదే ఈవెంట్లో చిరంజీవి తాతయ్య (అంజనాదేవి నాన్నగారు) ఫోటో చూపించి ఏమైనా మంచి జ్ఞాపకాలు పంచుకోమని కోరగా.. “మా తాత రసికులు.. ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు, బయట ఓ ముగ్గురు ఉండేవారు” అంటూ చిరంజీవి ఇచ్చిన సంబంధం లేని సమాధానం ఎవ్వరికీ మింగుడుపడలేదు. గతంలోనూ పూజా హెగ్డేతో (Pooja Hegde) “ఆచార్య” (Acharya) స్టేజ్ పై చిరంజీవి వ్యవహారశైలిని అందరూ ట్రోల్ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో “సరిలేరు నీలెవ్వరు” (Sarileru Neekevvaru) ఈవెంట్లో కూడా విజయశాంతితో (Vijaya Shanthi) స్టేజ్ పై ఆయనమాట్లాడిన విధానాన్ని అందరూ ఈజీగా తీసుకోలేకపోయారు.

వయసు పెరుగుతున్న కొద్దీ చాదస్తం పెరగడం అనేది సర్వసాధారణం, అయితే.. మెగాస్టార్ లాంటి మహోన్నత వ్యక్తి పదే పదే ఇలా నోరుజారడం, అసందర్భంగా వ్యవహరించడం అనేది బాధాకరం. ఆయన కాస్త తర్కం వీడి.. ఆయన్ను గొప్ప వ్యక్తిగా ఆరాధించే లక్షలాది మంది మనసుల్లో మెగాస్టార్ గానే చిరస్థాయిగా నిలిచిపోవాలి, అంతే కానీ ఇలాంటి నోరుజారడాలు, అసందర్భ ప్రేలాపనలతో ఆయన స్థాయి తగ్గించుకోకూడదు.
విశ్వక్ సేన్ మంచి ప్రౌఢలా కనిపిస్తున్నాడు
విశ్వక్ కాకుండా నిజంగా ఆడపిల్ల అయ్యుంటే.. ఎక్కడో గుండెజారి గల్లంతయ్యేది
విశ్వక్ బుగ్గ కొరికేయాలి అనిపించింది..Megastar #Chiranjeevi #Balakrishna #VishwakSen #Laila pic.twitter.com/V9ruPF8RNG
— Filmy Focus (@FilmyFocus) February 9, 2025
















