“ఏంటి..! నన్ను చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు.! నాగవంశీ అది… నాగవంశీ ఇది అంటూ గ్రిప్పింగ్ రైటింగ్ తో మంచి హడావిడి నడుస్తుంది. పర్వాలేదు ట్విట్టర్లో చాలా మంది రైటర్స్ ఉన్నారు. మిమ్మల్ని డిజప్పాయింట్ చేస్తున్నందుకు ‘ఐ యామ్ సారీ’. నాకు ఇంకా ఆ టైం రాలేదు. మినిమమ్ ఇంకో 10,15 ఏళ్ళ టైం ఉంది. సినిమాల్లోనే ఉంటా. సినిమా కోసమే ఉంటా. ‘మాస్ జాతర’ తో అతి త్వరలో మిమ్మల్నందరినీ కలుస్తాను” అంటూ తన ట్విట్టర్లో రాసుకొచ్చారు నాగవంశీ.
ఈ కామెంట్స్ వెనుక ఉన్న అర్థం చాలా మందికి తెలిసే ఉండొచ్చు. ఇటీవల ‘వార్ 2’ సినిమా రిలీజ్ అయ్యింది. ప్లాప్ టాక్ తెచ్చుకుంది. బయ్యర్స్ కి కూడా భారీ నష్టాలు గ్యారెంటీ అని తేలిపోయింది. ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేసింది నాగవంశీ. ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగవంశీ స్పీచ్ కూడా హైలెట్ అయ్యింది. ‘హిందీ నెట్ కంటే తెలుగు నెట్ ఎక్కువ ఉండాలి.. అది మీ బాధ్యత’ అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మంచి జోష్ నింపారు నాగవంశీ.
అతను కూడా ఎన్టీఆర్ కి వీరాభిమాని, పైగా ఎన్టీఆర్ తో నెక్స్ట్ 2 సినిమాలు చేస్తున్నాడు. కాబట్టి.. నాగవంశీ ఉత్సాహానికి బ్రేకులు వేసే ఛాన్స్ ఉండదు. కానీ ‘వార్ 2’ చూశాక నాగవంశీని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు నెటిజన్లు. నిర్మాతగా చేసిన ‘మాస్ జాతర’ రిలీజ్ గురించి పట్టించుకోవడం మానేసి డబ్బింగ్ సినిమా కోసం ఇంత తాపత్రయం ఎందుకు? అసలు ‘మాస్ జాతర’ రిలీజ్ చేస్తున్నావా? లేదా?’ అంటూ నెటిజన్లు నాగవంశీని తిట్టిపోస్తున్నారు. వారికి కౌంటర్ గానే నాగవంశీ ఈ ట్వీట్ వేసినట్టు అర్ధం చేసుకోవచ్చు. కాకపోతే ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు నాగవంశీ.